రివ్యూ : టాక్సీవాలా – డిఫరెంట్ హార్రర్ కామెడీ

స్టార్ కాస్ట్ : విజయ్ దేవరకొండ , ప్రియాంక , మాళవిక తదితరులు..
దర్శకత్వం : రాహుల్
నిర్మాతలు: జిఏ2 పిక్చ‌ర్స్ మ‌రియు యు.వి. క్రియేషన్స్
మ్యూజిక్ : జేక్స్ బిజోయ్
విడుదల తేది : నవంబర్ 17, 2018
తెలుగు మిర్చి రేటింగ్ : 2.75/5

రివ్యూ : టాక్సీవాలా – డిఫరెంట్ హార్రర్ కామెడీ

అర్జున్ రెడ్డి చిత్రం తో యూత్ స్టార్ గుర్తింపు తెచ్చుకున్న విజయ్ దేవరకొండ..ఆ తర్వాత గీత గోవిందం తో ఏకంగా వంద కోట్ల క్లబ్ లో చేరిపోయాడు. అప్పటి వరకు యూత్ స్టార్ గా ఉన్న విజయ్ , ఈ మూవీ తో ఫ్యామిలీ హీరో స్టేటస్ సంపాదించాడు. ఈ రెండు సినిమాలతో విజయ్ మార్కెట్ సైతం అమాంతం పెరిగింది. గీత గోవిందం తర్వాత వచ్చిన నోటా మాత్రం అభిమానులు నిరాశకు గురి చేసింది. పొలిటికల్ బ్యాక్ డ్రాప్ తో వచ్చిన ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర డిజాస్టర్ అయ్యింది.

తాజాగా ‘టాక్సీవాలా’ మూవీతో ఆడియన్స్ ముందుకొచ్చాడు. రిలీజ్‌కు ముందే ఈ మూవీ పైరసీ కి గురై అందరికి షాక్ ఇవ్వగా , దానిని ఏ మాత్రం లెక్క చేయకుండా సినిమాపై ఉన్న నమ్మకం తో ఈ చిత్రాన్ని ఈరోజు థియేటర్స్ లోకి తీసుకొచ్చారు.

మరి నోటా తో నిరాశ పరిచిన విజయ్..టాక్సీవాలా తో ఏ రేంజ్ హిట్ అందుకున్నాడో…దర్శక , నిర్మాతలకు ఈ సినిమా ఎలాంటి ఫలితాన్ని అందించిందో..పూర్తి రివ్యూ లో చూద్దాం.

కథ :

శివ (విజయ్ దేవరకొండ) మధ్య తరగతి కుర్రాడు. డిగ్రీ పూర్తి చేసిన శివ , జాబ్ చేద్దామని హైదరాబాద్ తన బాబాయ్ ఇంటికి వస్తాడు. ఎంత వెతికిన జాబ్స్ దొరకపోయేసరికి చివరకు తన అన్న , వదిన ల దగ్గర కాస్త డబ్బు తీసుకొని సెకండ్ హాండ్ టాక్సీ తీసుకుంటాడు. కుటుంబ బాధ్యతల్ని మోస్తూ.. అన్నా వదినలకు అండగా ఉంటాడు.

ఈ నేపథ్యంలో డాక్టర్ అనూష (ప్రియాంక జువర్కర్) చూసి మొదటి చూపులోనే ప్రేమలో పడతాడు. ఆమె కూడా శివ ప్రేమలో పడుతుంది..ఇక సాఫీగా సాగిపోతున్న శివ జీవితంలో ఊహించని మలుపు తిరుగుతుంది. తన టాక్సీని ఒక ఆత్మ ఆవహించి ఉంటుంది. ఇంతకీ ఆ కారులో ఆత్మ ఎందుకు ప్రవేశించింది. చివరకు ఆ ఆత్మ శాంతించిందా లేదా అనేదే మిగతా స్టోరీ.

ప్లస్ :

* డిఫరెంట్ హార్రర్ కామెడీ

* బ్యాక్ గ్రౌండ్ స్కోర్

* విజయ్ యాక్టింగ్

మైనస్ :

* టెక్నికల్ వాల్యూస్

* కమర్షియల్ ఎలిమేట్స్

న‌టీన‌టుల పెర్పామెన్స్ :

విజయ్ దేవరకొండ నటన గురించి కొత్తగా చెప్పాల్సిన పనే లేదు..రౌడీ గా నైనా, లవర్ గా నైనా ఏ పాత్రైనా చాల ఈజీ గా చేసే యాక్టింగ్ తనకు సొంతం. ఇక ఈ సినిమాలో మాములు మధ్యతరగతి టాక్సీవాలాగా చాలా బాగా నటించాడు. మరోసారి తన యాక్టింగ్‌తో ఈ మూవీకి ప్రాణం పోశాడు. తన అన్న, వదినలతో వచ్చే ఎమోషన్స్ సీన్స్‌‌లలో కంటతడి పెట్టించాడు.

* ఈ సినిమా తో తెలుగు ఇండస్ట్రీ కి హీరోయిన్ గా పరిచమైన ప్రియాంక జువాల్కర్‌ నటనకు పెద్దగా స్కోప్‌లేని పాత్ర దక్కింది.

* ఈ సినిమాలో కీ రోల్ పోషించిన మాళవిక నాయర్‌ని ‘టాక్సీవాలా’ టర్నింగ్ పాయింట్ అనే చెప్పాలి. ఎమోషన్స్ సీన్స్‌ బాగా పండించింది.

* విజయ్‌కి తల్లిగా నటించిన యమున, వదినగా నటించిన కళ్యాణి తమ యాక్టింగ్ తో ఆకట్టుకున్నారు.

* కమెడియన్స్ మధునందన్, జబర్దస్త్ చమ్మక్ చంద్ర తమ కామెడీ తో థియేటర్స్ లలో నవ్వులు పూయించారు.

* విజయ్‌కి ఫ్రెండ్ గా నటించిన తన రియల్ లైఫ్ ఫ్రెండ్ విష్ణు.. ‘హాలీవుడ్’ క్యారెక్టర్‌లో పొట్ట చెక్కలు చేశారు. తెలంగాణ యాసతో మంచి టైమింగ్ తో ఆకట్టుకున్నాడు.

సాంకేతిక విభాగం :

* ఈ చిత్రానికి జేక్స్ బిజాయ్ అందించిన పాటలు బాగున్నాయి. ముఖ్యం గా మాట వినదుగా అనే సాంగ్ హైలైట్ గా నిలిచింది. ఇక బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సైతం ఆకట్టుకుంది.

* సుజిత్ సారంగ్ ఫోటోగ్రఫీ సినిమాకు మరింత అందాన్ని తెచ్చించింది.

* సాయి కుమార్ రెడ్డి డైలాగ్స్ సినిమాకు హైలైట్స్ నిలిచాయి.

* జాషువా స్టంట్స్ ఆకట్టుకున్నాయి.

* ఇక చిత్ర నిర్మాణ విలువలు పెద్దగా ఆకట్టుకోలేకపోయాయి.

* ఇక డైరెక్టర్ రాహుల్ విషయానికి వస్తే..‘ఆస్ట్రల్ ప్రొజెక్షన్’ అనే సైంటిఫిక్ థియరీతో సైన్స్ ఫిక్ష‌న్ థ్రిల్లర్ అనే సరికొత్త జానర్‌తో సినిమాను తెరకెక్కించి మొదటి చిత్రమే సరికొత్త ప్రయోగం చేసి ఆకట్టుకున్నాడు. తన రాసుకున్న కథకు అనుగుణంగా మలుచుకుని గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లేతో సైన్స్ ఫిక్ష‌న్ కామెడీ థ్రిల్లర్‌‌ను అందించడంతో సక్సెస్ అయ్యారు.

ఇక ఇలాంటి చిత్రాలకు స్క్రీన్ ప్లే చాల కీలకం..అందుకే రాహుల్ చాల జాగ్రత్తలు తీసుకున్నాడు. కథలో ఎక్కడా స్క్రీన్‌ ప్లే పై గ్రిప్పింగ్ కోల్పోకుండా.. ఫస్టాఫ్ మొత్తం థ్రిల్లింగ్‌ ఎంటర్‌టైనర్‌గా నడిపించి, సెకండాఫ్‌లో అసలు కథ లోకి తీసుకెళ్లాడు. ఒక్కో పాత్రను పరిచయం చేస్తూ ప్రేక్షకుడికి ఎక్కడ బోర్ కొట్టించకుండా సినిమాను నడిపించి సక్సెస్ అయ్యాడు. కాకపోతే క్లైమాక్స్ విషయంలోనే ఇంకాస్త ఆలోచిస్తే బాగుండేది. ఓవరాల్ గా మొదటి సినిమాతోనే అందర్నీ ఆకట్టుకొన్నాడని చెప్పవచ్చు.

చివరిగా :

విడుదలకు ముందే సినిమా పైరసీ జరగడం తో సినిమా ఫై నెగిటివ్ ప్రచారం జరిగింది..కానీ సినిమా ఫై ఉన్న నమ్మకం తో చిత్ర మేకర్స్ సినిమాను భారీ గా విడుదల చేశారు. వారి నమ్మకమే సినిమాను విజయ బాట లోకి తీసుకెళ్లింది.

నోటా తో నిరాశ పరిచినప్పటికీ , టాక్సీవాలా తో మళ్లీ అభిమానుల్లో మైలేజ్ నింపాడు. డిఫరెంట్ హర్రర్ కామెడీ గా తెరకెక్కిన ఈ మూవీ అన్ని క్లాస్ ల ఆడియన్స్ ను ఆకట్టుకునేలా ఉంది.

నోట్ :

సినిమాను థియేటర్స్ లలో చూడండి..పైరసీ చేసి సినిమా ఇండస్ట్రీని నాశనం చేయకండి. ఎంతో ఖర్చు పెట్టి సినిమాలు తీస్తుంది కేవలం మన ఆనందం కోసమే..అలాంటి ఆనందాన్ని పైరసీ లో చూడకండి.

తెలుగు మిర్చి రేటింగ్ : 2.75/5

Click here for English Review