మహేష్ అభిమానుల కోరిక తీరినట్లే

ప్రస్తుతం టాలీవుడ్ హీరోలంతా పాన్ మూవీస్ చేస్తున్నారు. ఇప్పటికే ప్రభాస్ ఆ సినిమాలు చేయగా..అల్లు అర్జున్ , విజయ్ దేవరకొండ లాంటి వారు పాన్ మూవీస్ బాటలో ఉన్నారు. అయితే మా హీరో ఎప్పుడు పాన్ ఇండియా సినిమా చేస్తాడా అని మహేష్ అభిమానులు వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నారు.

అయితే సర్కారు వారి పాట తో ఆ ఎదురుచూపులు తెరపడబోతున్నట్లు తెలుస్తుంది. పరుశురాం డైరెక్షన్లో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని భారీ పాన్ లెవల్లో తెరకెక్కిస్తున్నారట. దానికి తగ్గట్లే కాస్ట్ & క్రూ ను సెలెక్ట్ చేస్తూ సినిమా ను భారీ నిర్మిస్తున్నారట.