హిరణ్య కశ్యప బడ్జెట్ వివరాలు పంచుకున్న సురేష్ బాబు

బాహుబలి సినిమాతో యావత్ ప్రేక్షకభిమానం పొందిన రానా..మరో చరిత్రత్మక చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. రుద్రమదేవి సినిమాతో చక్కటి విజయం అందుకున్న సీనియర్ దర్శకుడు గుణశేఖర్… పౌరాణిక కథాంశాన్ని తెరకెక్కించేందుకు రెడీ అవుతున్నాడు. హిరణ్యకశ్యప పేరుతో ఓ భారీ చిత్రాన్ని రూపొందించే పనిలో ఉన్నాడు. ఈ సినిమాలో అందరికి తెలిసిన భక్త ప్రహ్లాదుడి కథనే హిరణ్య కశ్యపుడి యాంగిల్లో ప్రెజెంట్ చేయనున్నాడట. చాలా నెలల నుండి ఈ ప్రాజెక్ట్ ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతూ వస్తుంది.

తాజాగా ఈ మూవీ బడ్జెట్ వివరాలు చిత్ర నిర్మాత సురేష్ బాబు తెలియజేసాడు. అంత బడ్జెట్ తో తెరకెక్కించడానికి కారణం ఏమిటని సదరు యాంకర్ అడుగగా…కొన్ని చిత్రాలకు కథ రీత్యా భారీ బడ్జెట్ అవసరం, వాటిని అలానే తీయాలి. ఇవి ప్రేక్షకులను థియేటర్స్ కి రప్పించే సినిమాలు అందుకే బడ్జెట్ మరియు స్క్రిప్ట్ విషయంలో రాజీపడకుండా తెరకెక్కించాలి అని అన్నారు. కాబట్టి హిరణ్య కశ్యప మూవీ భారీ స్కేల్ లో ఉండనుందని తెలుస్తుంది. ప్రీ ప్రొడక్షన్ పనులకే 15కోట్లు ఖర్చుపెట్టగా…ఫాక్స్ స్టార్ స్టూడియోస్ ఈ మూవీలో నిర్మాణ భాగస్వామిగా ఉండడం విశేషం. వచ్చే ఏడాది ఈ మూవీ సెట్స్ పైకి వెళ్లే అవకాశం ఉందని తెలియజేసాడు.