Korean Kanakaraju: ‘కొరియన్ కనకరాజు’పై పెరుగుతున్న అంచనాలు.. నైజాం, వైజాగ్‌లో SVC డిస్ట్రిబ్యూషన్!

Korean Kanakaraju

Korean Kanakaraju: మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా నటిస్తున్న ఇండో-కొరియన్ హారర్ కామెడీ చిత్రం ‘కొరియన్ కనకరాజు’ (Korean Kanakaraju). ఈ చిత్రం విడుదలకు ముందే భారీ హైప్‌ను సొంతం చేసుకుంటోంది. ఈ చిత్రానికి ప్రముఖ డిస్ట్రిబ్యూషన్ సంస్థ SVC నైజాం, వైజాగ్ ఏరియాల థియేట్రికల్ రైట్స్‌ను దక్కించుకోవడం సినీ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. దీంతో సినిమాపై ఇండస్ట్రీలో ఉన్న నమ్మకం, అంచనాలు ఏ స్థాయిలో ఉన్నాయో స్పష్టమవుతోందని ట్రేడ్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.

డైరెక్టర్ మేర్లపాక గాంధీ తెరకెక్కిస్తున్న ఈ చిత్రం రాయలసీమ బ్యాక్‌డ్రాప్‌లో సాగే వినోదాత్మక కథకు కొరియన్ హారర్ ఎలిమెంట్స్‌ను జోడిస్తూ రూపొందింది. కామెడీ, హారర్, ఫాంటసీ అంశాల మేళవింపుతో ప్రేక్షకులకు కొత్త అనుభూతిని అందించేందుకు మేకర్స్ ఈ చిత్రాన్ని తెరకెక్కించినట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో వరుణ్ తేజ్ టైటిల్ పాత్రలో కనిపించనున్నాడు. హీరోయిన్‌గా రితికా నాయక్ నటిస్తుండగా, ప్రముఖ కమెడియన్ సత్య కీలక పాత్రలో అలరించనున్నారు. యూవీ క్రియేషన్స్, ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్‌టైన్‌మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి సంగీత సంచలనం ఎస్. తమన్ సంగీతం అందిస్తున్నారు. భారీ అంచనాల మధ్య ‘కొరియన్ కనకరాజు’ చిత్రం ప్రపంచవ్యాప్తంగా ఆగస్టు 7న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది.