`లవ్ స్టోరీ ` నాన్ థియేట్రికల్ బిజినెస్ ఎలా ఉందో తెలుసా..?

ఫిదా’ తో అందర్నీ ఫిదా చేసిన శేఖర్ కమ్ముల..కాస్త గ్యాప్ తర్వాత నాగ చైతన్య – సాయి పల్లవి జంటగా పెట్టి లవ్ స్టోరీ అనే ఓ రొమాంటిక్ ఎంట‌ర్‌టైన‌ర్ చేస్తున్నాడు. ఫిదా తర్వాత శేఖర్ ఈ సినిమా చేయడం..అందులోనూ సాయి పల్లవి , నాగ చైతన్య లు నటించడం తో ఈ మూవీ ఫై అందరిలో భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. ప్రస్తుతం లాక్ డౌన్ కారణంగా షూటింగ్ కు బ్రేక్ పడింది.

లాక్ డౌన్ అనంతరం సినిమా షూటింగ్ మొదలు పెట్టి త్వరగా పూర్తి చేయాలనీ చూస్తున్నారు. కేవలం ఇంకా 15 రోజులు మాత్రమే షూటింగ్ మిగిలి ఉండడం తో జులై లో అది పూర్తి చేసి ఆగస్టు లో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకరావాలని భావిస్తున్నారట. ఇండస్ట్రీ వర్గాల సమాచారం మేరకు ఈ సినిమా నాన్-థియేట్రికల్ హక్కులను మేకర్స్ 18 కోట్లకు విక్రయించారని తెలుస్తోంది. డిజిటల్- శాటిలైట్ సహా డబ్బింగ్ హక్కులు కలుపుకుని ఇంత బిజినెస్ సాగింది. చైతన్య రేంజుకి ఇది బెస్ట్ బిజినెస్ అని చెప్పొచ్చు.