
సినీ నటుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కఠిన దీక్ష చేపట్టారు. నిన్న ఏకాదశి సంధర్భంగా చాతుర్మాస్య దీక్ష తీసుకున్నారు. ప్రజలకు మంచి జరగాలని భగవంతుడిని ప్రార్థిస్తూ నాలుగు నెలలు కఠిన దీక్షను పవన్ కళ్యాణ్ చేయనున్నారు. దీక్షలో భాగంగా..బ్రహ్మ చర్యం, ఒంటి పూట భోజనం, భూతల శయనం, నదీ స్నానం వంటి అనేక నియమాలు పాటించనున్నాడు.
ప్రస్తుతం పవన్ మూడు చిత్రాలను లైన్లో పెట్టిన సంగతి తెలిసిందే . కాకపోతే లాక్ డౌన్ కారణంగా ఈ చిత్రాల షూటింగ్ లకు బ్రేక్ పడింది. ఇవి ఎప్పుడు మొదలు అవుతాయో తెలియని పరిస్థితి. అందుకే పవన్ ఈ దీక్ష చేపట్టినట్లు అర్ధమవుతుంది.









