
నాగ చైతన్య – విక్రమ్ కె కుమార్ కలయికలో ఓ సినిమా తెరకెక్కబోతుందనే వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. కాగా ఇందులో ముందుగా సమంత ను హీరోయిన్ గా ఎంపిక చేశారనే వార్తలు వినిపించాయి కానీ ఇందులో నిజం లేదని విక్రమ్ తేల్చి చెప్పాడు.
విక్రమ్ మనసులో రష్మిక ను తీసుకోవాలని ఉందట. చైతు సైతం రష్మిక అయితే బాగుంటుందని సూచించాడట. మొదట కీర్తినే తీసుకోవాలని అనుకున్నప్పటికీ, పెంగ్విన్ మూవీ ఫలితంతో దర్శకనిర్మాతలు ఆలోచనలో పడ్డట్లు తెలుస్తోంది. కీర్తి నటించిన ఈ చిత్రం ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేదు. ఈ నేపథ్యంలో చైతూ మూవీ కోసం రష్మిక పేరును దర్శకనిర్మాతలు పరిశీలిస్తున్నట్లు టాక్. .









