గ్రీన్ ఛాలెంజ్ స్వీకరించిన రేణు దేశాయ్

రాజ్య‌స‌భ సభ్యులు సంతోష్ కుమార్ చేప‌ట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌కి మంచి ఆద‌ర‌ణ ల‌భిస్తుంది. ప్రముఖ రాజ‌కీయ నాయ‌కులు, సెల‌బ్రిటీలు, క్రీడా ప్ర‌ముఖులు ఇందులో భాగం అవుతున్నారు.

ఇప్పటికే పలువురు ఛాలెంజ్ లో పాల్గొని మొక్కలు నాటుతూ మరికొంతమందికి విసురుతున్నారు. తాజాగా ఈ ఛాలెంజ్ ను పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ స్వీకరించారు. యాంకర్ ఉదయ భాను విసిరినా ఈ ఛాలెంజ్ ను రేణు దేశాయ్ స్వీకరించారు.