
మెగా పవర్ స్టార్ రామ్ చార ప్రస్తుతం రాజమౌళి డైరెక్షన్లో ఆర్ఆర్ఆర్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా సెట్స్ ఫై ఉండగానే సరికొత్త కథలను వింటున్నాడట. ప్రస్తుతం లాక్ డౌన్ రావడం తో చిత్రసీమ కు ఫుల్ రెస్ట్ దొరికింది..దీంతో అగ్ర నటులంతా కొత్త కథల ఎంపిక లో బిజీ అయ్యారు.
లాక్ డౌన్ లో చరణ్ చాలా కథలను విన్నాడట వాటిలో ఓ కథకు ఆయన ఇంప్రెస్ అయ్యాడని తెలుస్తుంది. రీసెంట్ గా సతీష్ అనే కొత్త దర్శకుడు.. చరణ్ కు ఓ స్టోరీ వినిపించగా… ఆ స్టోరీ బాగా నచ్చడం తో వెంటనే చరణ్ ఓకే చెప్పాడని అంటున్నారు. ఈ కథ చాలా ఇన్నోవెటివ్ కాన్సెప్ట్ అని సమాచారం . రామ్ చరణ్ తన కెరీర్ లో ఇప్పటి వరకు డెబ్యూ డైరెక్టర్ తో వర్క్ చేయలేదు. ఇప్పుడు ఇదే కనుక నిజమై ఈ ప్రాజెక్ట్ లైన్లోకి వస్తే మాత్రం చరణ్ కొత్త దర్శకుడి తో వర్క్ చేయబోయే ఫస్ట్ సినిమా అవుతుంది.









