అక్షయ్ ఇలాంటి నిర్ణయం తీసుకోవడం అవసరమా..?

బాలీవుడ్ యాక్షన్ హీరో అక్షయ్ కుమార్ ఎప్పుడు సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకుంటూ వార్తల్లో నిలుస్తుంటారు. కరోనా టైములో కూడా తన సినిమాను పూర్తి చేసి వార్తల్లో నిలిచాడు. ఇప్పుడు తాజాగా మరో నిర్ణయం తీసుకుని వార్తల్లో నిలిచాడు. కరోనా ప్రవాహంలో కూడా మరో సినిమా షూటింగ్ కోసం సిద్దమవుతున్నాడు.

వాషు భగ్నాని నిర్మాణంలో అక్షయ్ ‘బెల్ బాటమ్’ అనే సినిమా చేస్తున్నాడన్న విషయం అందరికీ తెలిసిందే.అయితే, ఆగస్టు నెలలో ఈ చిత్రంలోని కీలక సన్నివేశాలను షూట్ చేయడానికి చిత్రబృందం ఇప్పటికే సన్నాహాలు చేసుకుంటుంది. ప్రస్తుతం కరోనా ఉదృతి తీవ్ర స్థాయి లో ఉన్న తరుణంలో అక్షయ్ సినిమా చేయడం అవసరమా అని అభిమానులు అంటున్నారు.