మెగా సిస్టర్స్ వారు కాదట..

ప్రస్తుతం చిరంజీవి కొరటాల శివ డైరెక్షన్లో ఆచార్య మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఆ తర్వాత మళయాళ సూపర్ హిట్ మూవీ ‘లూసిఫర్’ రీమేక్‌లో నటించబోతున్నారు. ఇప్పటికే డైరెక్టర్ సుజిత్ ఈ సినిమా పనుల్లో బిజీ గా ఉన్నాడు.ఈ సినిమాలో చిరంజీవి సిస్టర్ గా నటించేది వీరే అంటూ పలువురు సీనియర్ నటీమణుల పేర్లు చక్కర్లు కొడుతున్నాయి. రోజా , సుహాసిని , కుష్బూ ఇలా పేర్లు ప్రచారం జరగడం తో వీరిలో ఎవరు నటించబోతున్నారో అని మెగా అభిమానులు సందేహం లో పడ్డారు.

అయితే వీరి లో ఎవరుకూడా నటించడం లేదని చిత్ర యూనిట్ క్లారిటీ ఇచ్చింది . బయట ప్రచారం అవుతున్న వాటిల్లో ఏమాత్రం నిజం లేదని తేల్చి చెప్పింది. ఇక తెలుగు ఆడియన్స్ కోరుకునే ఎమోషన్స్ కి తగ్గట్టుగా లూసిఫెర్ స్క్రిప్ట్‌లో కొన్ని కీలకమైన మార్పులు చేశారని.. ముఖ్యంగా హీరోయిజమ్ ఎలివేషన్స్ ఉన్న సన్నివేశాలు సినిమాలోనే మెయిన్ హైలైట్ గా నిలిచేలా సుజిత్ ప్లాన్ చేస్తున్నాడట. అలాగే మెగా అభిమానులకు ఫుల్ జోష్ ని ఇచ్చేలా యాక్షన్ సీక్వెన్స్ కూడా ఉంటాయని చిత్ర యూనిట్ తెలిపారు.