
విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ హీరోగా దొరసాని చిత్రం తో ఇండస్ట్రీ కి పరిచమైన సంగతి తెలిసిందే. మంచి అంచనాల మధ్య వచ్చిన ఈ మూవీ ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేకపోయాయి. తాజాగా ఆనంద్ తన రెండో సినిమాని ప్రకటించాడు. భవ్య క్రియేషన్స్ బేనర్లో ఆనంద్ తన రెండో సినిమా చేయనున్నాడు.
దీనికి సంబంధించి అఫీషియల్ ప్రకటన రాగా, ఈ మూవీని వినోద్ అనంతోజు అనే ఓ నూతన దర్శకుడు తెరకెక్కించనున్నాడు. బిగిల్ ఫేమ్ వర్ష బొల్లమ్మ ఈ మూవీలో హీరోయిన్ గా నటిస్తుంది. ఈ చిత్రానికి స్వీకర్ అగస్తీ సంగీతం అందిస్తున్నారు. మిడిల్ క్లాస్ మెలోడీస్ అనే టైటిల్‌తో రూపొందనున్న ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలు మరికొద్ది రోజులలో వెల్లడించనున్నారు.









