తెలంగాణ లో కాస్త తగ్గుముఖం పట్టిన కరోనా కేసులు

మొన్నటి వరకు తెలంగాణ రాష్ట్రంలో కరోనా ఉగ్రరూపం దాల్చగా..శుక్రవారం కాస్త తగ్గుముఖం పట్టింది.తెలంగాణలో శుక్రవారం నాడు కొత్తగా మరో 1,278 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీటిల్లో అత్యధిక కేసులు గ్రేటర్ హైదరాబాద్‌లోనే 762 నమోదవ్వగా.. ఆ తర్వాత రంగారెడ్డిలో 171, మేడ్చల్ లో 85 కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రవ్యాప్తంగా నమోదైన మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 32,224కు చేరింది.

ఇక ఏపీ విషయానికి వస్తే..

శుక్రవారం కొత్తగా 1608 కరోనా కేసులు నమోదు కాగా, ఇందులో రాష్ట్రానికి చెందినవి 1576 కాగా, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చినవారి 32 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. దీనితో రాష్ట్రంలో మొత్తంగా పాజిటివ్ కేసుల సంఖ్య 25,422కు చేరింది. ఇందులో యాక్టివ్ కేసులు 11, 936 కాగా, 13,194 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు.