రియల్ స్టార్ కొడుకు మరో సినిమాకు సిద్దమవుతున్నాడు..

యాక్షన్‌ స్టార్‌ దివంగత నటుడు శ్రీహరి తనయుడు మేఘాంశ్‌ హీరోగా ‘రాజ్‌దూత్‌’ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. నక్షత్ర, ప్రియాంక వర్మ హీరోయిన్లు గా నటించిన ఈ చిత్రానికి అర్జున్‌ – కార్తీక్‌ సంయుక్తంగా దర్శకత్వం వహించగా.. ఎమ్‌.ఎల్‌.వి. సత్యనారాయణ నిర్మాత. అయితే ఈ సినిమా అనుకున్నంత విజయం సాదించకపోవడం తో శ్రీహరి అభిమానులు కాస్త నిరాశకు గురి అయ్యారు.

అందుకే ఈసారి రియ‌ల్ స్టార్ అభిమానుల‌ను అల‌రించేందుకు, ఓ కమర్షియల్ కథాంశంతో ఆడియెన్స్ ముందుకు రావాలని మేఘాంశ్‌ నిర్ణయించుకున్నాడు. అందుకే రెండ‌వ సినిమాపై ప‌క్కా ఫోక‌స్ పెట్టాడు. ఇటీవలే మేఘాంశ్ ఓ కథను ఫైనలైజ్‌ చేశారని త్వరలోనే ఈ ప్రాజెక్టుకు సంబంధించిన వివరాలు అఫిషియ‌ల్ గా తెలియజేయనున్నారని సమాచారం.