
లాక్ డౌన్ కారణంగా గత మూడు నెలలుగా సినిమా షూటింగ్‌లు , అలాగే సీరియల్ షూటింగ్ లు ఇలా అన్ని ఆగిపోయిన సంగతి తెలిసిందే. రీసెంట్ గా రాష్ట్ర ప్రభుత్వాలు పలు నిబంధనలు సూచిస్తూ షూటింగ్ లకు అనుమతి ఇచ్చింది. దీంతో పలు సీరియల్స్ , చిన్న సినిమాలు షూటింగ్ లు మొదలుపెట్టాయి. అయితే ఇప్పుడు హైదరాబాద్ లో కరోనా ఉదృతి ఎక్కువగా ఉన్న నేపథ్యంలో వారిని కరోనా వెంటాడుతుంది.
ఇప్పటికే నవ్య స్వామి, రవికృష్ణ, ఝాన్సీ, సాక్షి శివ, ప్రభాకర్ వంటి వారు కరోనా బారిన పడగా తాజాగా మరో బుల్లితెర నటుడు భరద్వాజ్ రంగావిజ్జుల కరోనా బారిన పడ్డారు. స్వాతిచినుకులు, బంధం అనే టీవీ సీరియల్స్‌తో గుర్తింపు తెచ్చుకున్న భరద్వాజ్ కరోనా బారిన పడ్డట్టు తన ఇన్స్టాగ్రామ్ ద్వారా తెలిపారు. కరోనా లక్షణాలు తనకి లేవని, మంచి డైట్‌తో పాటు మందులు వాడితే ఈ మహమ్మారిని నుండి బయటపడొచ్చని చెప్పుకొచ్చాడు. తనతో కాంటాక్ట్ అయిన వాళ్ళు టెస్ట్‌లు చేయించుకోవడంతో పాటు క్వారంటైన్లో ఉండాలని కోరారు.









