ఆ ఇద్దరు కన్నీరు పెట్టిస్తారట..

బాహుబలి చిత్రం తర్వాత ప్రభాస్ తన సినిమాల ప్లానింగ్ లను మార్చుకున్నాడు. తన నుండి వచ్చే ప్రతి సినిమా పాన్ ఇండియా మూవీ తరహాలోనే ఉండేలా ప్లాన్ చేస్తున్నాడు. ఈ మధ్యనే సాహో చిత్రం అలాగే రాగా..త్వరలో రాబోతున్న రాధాకృష్ణ డైరెక్షన్ రాధే శ్యామ్ కూడా అదే తరహా లో రిలీజ్ కాబోతుంది. పూజా హగ్దే హీరోయిన్ గా తెరకెక్కుతున్న ఈ భారీ బడ్జెట్ మూవీ ని గోపి మూవీస్ , యూవీ క్రియేషన్స్ బ్యానర్ లు నిర్మిస్తున్నారు.

 ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ మూవీకి లాక్ డౌన్ బ్రేక్ ఇచ్చింది. ఈ నేపథ్యంలో ఈ సినిమా తాలూకా అనేక విషయాలు సోషల్ మీడియా లో చక్కర్లు కొడుతున్నాయి. ఈ మూవీ క్లైమాక్స్ బరువైన ఎమోషన్స్ తో దర్శకుడు డిజైన్ చేశాడని అంటున్నారు. ఘాడ ప్రేమికుల మధ్య వచ్చే భావోద్వేగ సన్నివేశాలు, ప్రేక్షకుల చేత కంట నీరు పెట్టీయడం ఖాయం అని అంటున్నారు.