
కరోనా వ్యాక్సిన్ కౌంట్‌డౌన్ మొదలైయిందని తెలుస్కతుంది. ఒకటి రెండు నెలల్లో అందుబాటులోకి వస్తుందా?ఇటీవలి పరిణామాలు చూస్తుంటే ఇది నిజమే అనిపిస్తోంది. పలు దిగ్గజ ఔషధ సంస్థలు పోటీపడి మరీ అత్యంత వేగంగా క్లినికల్ ట్రయల్స్ నిర్వహిస్తూ టీకా పనితనాన్ని పరీక్షిస్తున్నాయి.
వీలైనంత త్వరగా విరుగుడు అందుబాటులోకి తెచ్చేందుకు కృషిచేస్తున్నాయి. దేశీయంగాను, అంతర్జాతీయ స్థాయిలోనూ ఈ ప్రయత్నాలు ముమ్మరమయ్యాయి. ఈ క్రమంలోనే భారత్ బయోటెక్‌కు చెందిన కొవాగ్జిన్ టీకా పరీక్షలు కీలకమైన మూడోదశకు చేరుకోవటం ఆసక్తి కలిగిస్తున్న పరిణామం.









