నార్త్ లో 100 కోట్ల క్లబ్ లో చేరిన ఆర్ఆర్ఆర్

దర్శక ధీరుడు రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన మల్టీ స్టారర్ యాక్షన్ మూవీ ఆర్ఆర్ఆర్. అల్లూరి సీతారామరాజుగా రామ్ చరణ్ , కొమురంభీం పాత్రలో జూనియర్ ఎన్టీఆర్ నటించిన ఈ మూవీ (మార్చి 25) న ప్రేక్షకుల ముందుకు వచ్చి భారీ విజయం సాధించింది. దీంతో బాక్స్ ఆఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబడుతుంది.

కేవలం సౌత్ లోనే కాదు నార్త్ లోను వసూళ్ల వర్షం కురిపిస్తుంది. తాజాగా నార్త్ లో కేవలం ఐదు రోజుల్లో 100 కోట్ల క్లబ్ లో చేరిన ఫస్ట్ మూవీ గా ఆర్ఆర్ఆర్ నిలిచింది. మంగళవారం 5వ రోజుకి గాను 16 కోట్ల నెట్ వసూళ్లు సాధించి టోటల్ గా 107 కోట్లు అందుకున్నట్టుగా ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. మరి లాంగ్ రన్ లో ఎంత వసూళ్లు చేస్తుందో చూడాలి.