
క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, హీరో గా నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తున్న శ్రీ విష్ణు హిట్ , ప్లాప్ లతో సంబంధం లేకుండా వరుస సినిమాలు చేస్తూ ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. తాజాగా ‘అల్లూరి’ అనే టైటిల్ తో త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. బెక్కెం వేణుగోపాల్ – బబిత నిర్మిస్తున్న ఈ సినిమాకి ప్రదీప్ వర్మ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇది ఒక సిన్సియర్ ఆఫీసర్ చుట్టూ అల్లుకున్న కథ.
ఆ పోలీస్ ఆఫీసర్ గా శ్రీవిష్ణు కనిపించనున్నాడు. ఇంతవరకూ తను చేస్తూ వచ్చిన సినిమాలకి ఇది పూర్తి భిన్నంగా ఉంటుందట. హర్షవర్ధన్ రామేశ్వర్ ఈ సినిమాకి సంగీతాన్ని సమకూర్చుతున్నాడు. కాగా ఈ సినిమా కు సంబదించిన ప్రీ లుక్ ను తాజాగా చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది.









