బుల్లితెర ఫై సందడి చేయబోతున్న అఖండ

నందమూరి బాలకృష్ణ – బోయపాటి శ్రీను కలయికలో హ్యాట్రిక్ మూవీ గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం అఖండ. డిసెంబర్ 02 న థియేటర్స్ లలో విడుదలైన ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద భారీ వసూళ్లు సాధించి సరికొత్త రికార్డు నెలకొల్పింది. కేవలం థియేటర్స్ లలోనే కాదు ఓటిటి ఫ్లాట్ ఫామ్ లో కూడా సరికొత్త రికార్డ్స్ నెలకొల్పింది. ఇక ఇప్పుడు బుల్లితెర ఫై సందడి చేసేందుకు సిద్ధమైంది.

వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ షో గా ఏప్రిల్ 10, ఆదివారం సాయంత్రం 6 గంటలకు స్టార్ మా లో ప్రసారం కాబోతుంది. థియేటర్లలో, అటు ఓటిటిలో మంచి రెస్పాన్స్ ను రాబట్టుకున్న “అఖండ” మూవీని మరోసారి స్మాల్ స్క్రీన్ పై కుటుంబ సమేతంగా చూసి ఆనందించడానికి నందమూరి అభిమానులు ఆతృతగా ఎదురు చూస్తున్నారు.