ఆర్ఆర్ఆర్ ఏరియా వైజ్ 12 డేస్ కలెక్షన్స్

దర్శక ధీరుడు రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన మల్టీ స్టారర్ యాక్షన్ మూవీ ఆర్ఆర్ఆర్. అల్లూరి సీతారామరాజుగా రామ్ చరణ్ , కొమురంభీం పాత్రలో జూనియర్ ఎన్టీఆర్ నటించిన ఈ మూవీ (మార్చి 25) న ప్రేక్షకుల ముందుకు వచ్చి భారీ విజయం సాధించింది. భారీ అంచనాల నడుమ రిలీజ్ అయినా ఈ మూవీ అంతే రేంజ్ లో కలెక్షన్లు రాబడుతుంది.

తాజాగా 12 డేస్ కలెక్షన్లు చూస్తే..

నైజాంలో రూ. 101.36 కోట్లు, సీడెడ్‌లో రూ. 46.55 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 31.61 కోట్లు, ఈస్ట్‌లో రూ. 14.36 కోట్లు, వెస్ట్‌లో రూ. 12.00 కోట్లు, గుంటూరులో రూ. 16.77 కోట్లు, కృష్ణాలో రూ. 13.40 కోట్లు, నెల్లూరులో రూ. 8.31 కోట్లతో కలిపి రూ. 244.36 కోట్లు షేర్, రూ. 367.00 కోట్లు గ్రాస్ వచ్చింది. ఇక ప్రపంచవ్యాప్తంగా 12 రోజుల్లోనే రూ. 521.06 కోట్లు షేర్‌, రూ. 938.50 కోట్లు గ్రాస్‌ను వసూలు చేసినట్లు సమాచారం.