సిరిసిల్లలో బాలయ్య 107 షెడ్యూల్ పూర్తి

balakrishna 107 sircilla schedule completed
balakrishna 107 sircilla schedule completed

అఖండ మూవీ తో సూపర్ హిట్ అందుకున్న బాలకృష్ణ..ప్రస్తుతం తన 107 మూవీ చేస్తున్నాడు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో క్రాక్ ఫేమ్ గోపీచంద్ మలినేని డైరెక్షన్లో ఈ మూవీ తెరకెక్కుతుంది. గత కొద్దీ రోజులుగా సిరిసిల్ల పరిసర ప్రాంతాల్లో శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోన్న ఈ చిత్రం.. అక్కడే ఓ షెడ్యూల్​ను పూర్తిచేసుకుని మరో కీలక షెడ్యూల్​ను కూడా ఇటీవలే ప్రారంభించింది. ప్రముఖ ఫైట్‌ మాస్టర్లు రామ్‌ లక్ష్మణ్‌ నేతృత్వంలో.. యాక్షన్ సన్నివేశాలను.. బాలకృష్ణ, ఇతర ప్రధాన తారాగణంపై తెరకెక్కించారు. అయితే తాజా సమాచారం ప్రకారం.. ఈ యాక్షన్​ షెడ్యూల్​​ పూర్తైనట్లు తెలిసింది. దీంతో కొత్త షెడ్యూల్​ షూటింగ్​ను హైదరాబాద్​లో ప్రారంభించాలని మూవీటీమ్​ సన్నాహాలు చేస్తోందట.

ఈ మూవీలో శ్రుతిహాసన్‌ హీరోయిన్ గా నటిస్తుండగా..దునియా విజయ్‌, వరలక్ష్మి శరత్‌కుమార్‌ కీలక పాత్రలు పోషిస్తున్నారు. నిజ జీవిత సంఘటనల ఆధారంగా సిద్ధమైన ఈ కథలో బాలకృష్ణ రెండు కోణాల్లో సాగే పాత్రలో సందడి చేయనున్నట్టు తెలిసింది. విదేశీ నేపథ్యమూ ఇందులో ఉంటుందని సమాచారం. ఈ చిత్రానికి తమన్​ సంగీతం అందిస్తున్నారు. రిషి పంజాబీ ఛాయాగ్రహణం అందిస్తున్నారు. సాయిమాధవ్‌ బుర్రా మాటలు అందించారు.