PMF 32 : హసిత్ గోలి గాడి రాత, తీతలో మన శ్రీవిష్ణు గాడి కొత్త సినిమా..


గ‌తేడాది సామజవరగమన సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న హీరో శ్రీ విష్ణు ప్ర‌స్తుతం ‘ఓ భీమ్ బుష్’ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు శ్రీవిష్ణు తదుపరి సినిమాకు సంబంధించిన అప్డేట్ వచ్చింది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ప్రొడక్షన్ నెం 32 గా వస్తున్న ఈ చిత్రానికి టీజీ విశ్వ ప్రసాద్ నిర్మాత‌గా వ్యవహరిస్తుండగా, హసిత్ గోలి ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌బోతున్నాడు. వివేక్ కూచిబొట్ల సహా నిర్మాత. ఇకపోతే ఈ సినిమా టైటిల్‌ను రేపు అనౌన్స్ చేయ‌నున్న‌ట్లు చిత్ర‌యూనిట్ చాలా వినూత్నంగా ప్ర‌క‌టించింది.

రేపు శ్రీవిష్ణు పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా టైటిల్ ను ప్రకటించనున్నారు. “టీజీ విశ్వప్రసాద్ నిర్మిత.. హసిత్ గోలి గాడి రాత, తీతలో.. మన శ్రీవిష్ణు గాడి కొత్త సినిమా నామకరణం అట.. ముహూర్తం: మాఘ బహుళ పంచమి ఉ ౧౧:౪౫ కి.. అదే, రేపు ఉద‌యం 11 గంటల 45 నిమిషాల‌కు. రేపు కలుద్దాం” అంటూ పోస్టర్ ను రిలీజ్ చేసారు. అంతేకాదు ఇది అచ్చమైన తెలుగు సినిమా. దీంతో మీరు సంతృప్తి చెందుతారు అని చెప్పారు.

Also Read :  Megastar Chiranjeevi Honoured With The NTR National Film Award In Gaddar Awards 2025

ఇకపోతే శ్రీవిష్ణు మరియు దర్శకుడు హసిత్ గోలి కలిసి ‘రాజ రాజ చోర’ చిత్రంతో ప్రేక్షకులను ఎంతగా అలరించారో తెలిసిందే. మరి ఈ సినిమాతో మరింత ఎంటర్‌టైన్మెంట్ ను అందించడానికి వినోదాత్మకమైన స్క్రిప్ట్ ను సిద్ధం చేసాడు దర్శకుడు హసిత్ గోలి. ఇక ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు రేపు ప్రకటించనున్నారు.