
SSMB29 : సూపర్ స్టార్ మహేష్ బాబుతో రాజమౌళి తీస్తున్న పాన్ ఇండియా మూవీ SSMB 29 పై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఇప్పటి వరకు ఎలాంటి అఫీషియల్ అప్‌డేట్స్ లేకుండా షూటింగ్ సాగుతుండటంతో అభిమానుల్లో ఉత్కంఠ నెలకొంది. హైదరాబాద్, ఒడిశాలో కీలక షెడ్యూల్స్ పూర్తయ్యాయి. తాజాగా వేసవి బ్రేక్ తర్వాత టీం మళ్లీ సెట్స్ మీదకు వచ్చిందని సమాచారం.
ఈ నేపథ్యంలో, ఆగస్టు 9న మహేష్ బర్త్‌డే సందర్భంగా భారీ అప్‌డేట్ రాబోతుందనే వార్త ఫిల్మ్ సర్కిల్స్ లో జోరుగా వినిపిస్తోంది. ఓ వీడియో గ్లింప్స్, లేదా టైటిల్ రివీల్‌తో జక్కన్న అభిమానులకు కానుక ఇవ్వనున్నాడని టాక్. అయితే అధికారికంగా ఏమీ రాకపోయినా, ఫ్యాన్స్ మాత్రం ఈసారి ఖచ్చితంగా ఏదో వస్తుందనే నమ్మకంతో ఉన్నారు.










