Mothevari Love Story : తెలంగాణ గ్రామీణ ప్రేమకథగా ‘మోతెవరి లవ్ స్టోరీ’


Mothevari Love Story : గ్రామీణ ప్రేమకథ నేపధ్యంలో ‘మోతెవరి లవ్ స్టోరీ’ అనే టైటిల్‌తో జూలై 9న పోస్టర్ విడుదలైంది. తెలంగాణ గ్రామీణ నేపథ్యంలో రూపొందిన ఈ సిరీస్‌లో మొత్తం ఏడు ఎపిసోడ్లు ఉండనున్నాయి. అనిల్ జీలా, వర్షిణి రెడ్డి జున్నుతుల ప్రధాన పాత్రల్లో నటించిన ఈ వెబ్ సిరీస్‌ను శివ కృష్ణ బుర్రా దర్శకత్వం వహించగా, మై విలేజ్ షో మూవీస్ బ్యానర్‌పై మధుర శ్రీధర్ నిర్మించారు. ఓ పెళ్లి చుట్టూ నడిచే హాస్యభరిత ప్రేమకథ, భూ తగాదాలు, కుటుంబ గర్వం వంటి అంశాలతో ఈ సిరీస్ ఆకట్టుకోబోతోంది.

Also Read :  జగపతి బాబు 'వదలా' ఇంట్రెస్టింగ్ ఫస్ట్ లుక్ రిలీజ్...

ఈ సిరీస్ పోస్టర్‌ను నటుడు ఆనంద్ దేవరకొండ విడుదల చేశారు. ఆయన మాట్లాడుతూ చిన్న సినిమా, పెద్ద సినిమా అనే తేడా ఉండదని, టైటిల్, పోస్టర్ చాలా కొత్తగా ఉన్నాయని ప్రశంసించారు. ZEE5 బిజినెస్ హెడ్ అనురాధ గూడూర్, కంటెంట్ హెడ్ దేశ్ రాజ్, వైస్ ప్రెసిడెంట్ జయంత్ లాంటి వారు ఈ ప్రాజెక్టుకు పూర్తి మద్దతు ఇచ్చారు. మై విలేజ్ షో టీమ్ నుండి వచ్చిన ఈ సిరీస్, తెలంగాణ యాస, సంస్కృతి, జీవనశైలిని ప్రతిబింబించేలా ఉంటుందని వారు చెప్పారు. మంచి కంటెంట్‌ను తక్కువ బడ్జెట్‌లో రూపొందించిన ప్రయత్నానికి ప్రశంసలు అందుతున్నాయి.

Also Read :  Peddi : 'పెద్ది' డబ్బింగ్ స్టార్ట్.. వైరల్ అవుతున్న చరణ్ కామెంట్స్!

ఆగస్ట్ 8న ZEE5 లో విడుదల కానున్న ఈ సిరీస్ మై విలేజ్ షో యూట్యూబ్ ఛానెల్ నుంచి వెబ్ సిరీస్ ప్రపంచంలోకి వచ్చిన మొదటి ప్రయత్నం. ఈ సిరీస్‌లో సంగీతం చరణ్ అర్జున్ అందించగా, కెమెరా వర్క్ శ్రీకాంత్ చేసినట్లు టీమ్ పేర్కొంది. మట్టిలో మాణిక్యంలా నిలిచే ఈ గ్రామీణ ప్రేమకథ ప్రేక్షకులను నవ్విస్తూ, ఆలోచింపజేసేలా రూపొందించబడింది. ఈ ప్రయత్నం ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటుందని మేకర్స్ నమ్మకంగా చెబుతున్నారు.