Prabhas : ప్రభాస్ అభిమానులకు ఆనందం కంటే బాధే ఎక్కువ..!

Prabhas

Prabhas : భారీ విస్ఫోటనంలా ప్రేక్షకుల హృదయాల్లో ముద్ర వేసిన సినిమా బాహుబలి విడుదలై ఈరోజుకు దశాబ్దం పూర్తయింది. అయితే, భారతీయ సినిమా చరిత్రలో అంతటి ప్రభావాన్ని చూపిన సినిమా ఇప్పటికీ మరొకటి కనిపించలేదు. ఈ నేపథ్యంలో తాజాగా బాహుబలి ప్రమోషన్ డేస్‌కు చెందిన ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అయితే ఆశ్చర్యకరంగా, ఈ వీడియో అభిమానుల్లో ఆనందం కంటే బాధే ఎక్కువగా కలిగిస్తోంది.

ఈ వీడియోలో ప్రభాస్, రానాలు కలిసి బాహుబలి ట్రైలర్‌కు సంబంధించిన కొన్ని విషయాలు పంచుకుంటున్నారు. కానీ వీడియోలోని హైలైట్ ఏమిటంటే, ప్రభాస్ లుక్! చాలానే స్లిమ్‌గా, శరీరంగా ట్రిమ్‌డ్‌గా, షార్ప్ జాలైన్‌తో ఎంతో స్టైలిష్‌గా కనిపిస్తున్నాడు. అప్పటి ప్రభాస్‌లా ఇప్పుడైతే లేడంటూ కొందరు నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు.

Also Read :  Rakasa : నవ్విస్తూనే భయపెడుతున్న నిహారిక 'రాకాస' టీజర్

వీడియోలో కనిపిస్తున్న ప్రభాస్ ఆకర్షణీయమైన రూపం అభిమానులకు గతంలోని మాధుర్యాన్ని గుర్తుచేస్తోంది. అప్పటి ప్రభాస్‌కు ఉన్న కాంతి, ఆకర్షణ, స్క్రీన్ ప్రెజెన్స్ అన్నీ మాయమయ్యాయనే భావన పలువురిలో వ్యక్తమవుతోంది. మామూలుగా ఏ వ్యక్తైనా వయసుతో మారడం సహజమే. అదే ప్రభాస్‌కీ వర్తిస్తుంది. కానీ బాహుబలి ప్రభాస్ నుంచి ప్రస్తుతం ఉన్న ప్రభాస్‌కు వచ్చిన మార్పు అభిమానులకు సంతృప్తినివ్వడం లేదు.

Also Read :  Suriya46 : సూర్య - వెంకీ అట్లూరి మూవీకి క్లాసీ టైటిల్ ఫిక్స్..

ఇటీవలి కాలంలో ప్రభాస్ లుక్స్‌పై విమర్శలు వచ్చిన మాట నిజమే. అయితే ఈ త్రో బ్యాక్ వీడియో మాత్రం ఆయన మునుపటి క్రేజ్‌ను మళ్లీ గుర్తు చేస్తోంది. నిజం చెప్పాలంటే, ఈ లుక్‌ను మళ్లీ పునరావృతం చేయడం సాధ్యం కాదని భావిస్తూ, ప్రభాస్ అభిమానులే కొంత ఆవేదనతో స్పందిస్తున్నారు.

ఇక్కడి నుంచే అన్నీ క్రమంగా మారిపోయాయంటూ, “ఆ లెవల్ ప్రభాస్ మళ్లీ చూడలేమేమో” అనే భావన ప్రేక్షకుల్లో తలెత్తడం ఆందోళనకరమన్నది వాస్తవం.