Secret : మాధవన్ యవ్వన రహస్యాలు.. ఫిల్లర్లు కాదు, ఆయుర్వేదమే నిజమైన ఔషధం

Madhavn

Secret : బాలీవుడ్ నటుడు ఆర్. మాధవన్ తన యవ్వన శరీర రూపానికి కారణం ఆయుర్వేద పద్ధతులేనని వెల్లడించారు. 55 ఏళ్ల వయసులోనూ చిటికెల్లో ఆకర్షణీయంగా కనిపిస్తున్న మాధవన్, తాజాగా తన ఫిట్‌నెస్ వెనుక ఉన్న రహస్యాలను మీడియాతో పంచుకున్నారు. తన ఆరోగ్యకరమైన జీవనశైలికి గ్లామర్ ట్రీట్మెంట్లు కాదని, సహజ విధానాలే అని స్పష్టంగా చెప్పారు.

మాధవన్ మాట్లాడుతూ, “నిజమైన ఆరోగ్యం ప్రకృతి నుండి వస్తుంది. సూర్యరశ్మి, కొబ్బరి నూనె, ఇంట్లో వండిన ఆహారమే నాకు ఇష్టమైనవి. ఇవే నా సౌందర్యాన్ని కాపాడుతున్నాయ” అని చెప్పారు. ఫిల్లర్లు, సౌందర్య చికిత్సలు వంటి ప్రక్రియల గురించి మాట్లాడుతూ, “అవి కేవలం మోసం. వృద్ధాప్యాన్ని గౌరవంగా స్వీకరించాలి” అన్నారు.

Also Read :  Peddi OTT Partner: అఫీషియల్.. ‘పెద్ది’ ఓటీటీ పార్ట్నర్ లాక్! స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

తన జుట్టు సంరక్షణ విషయానికి వస్తే, మాధవన్ ప్రతి ఆదివారం నువ్వుల నూనెతో తలస్నానం చేస్తానని తెలిపారు. రోజూ కొబ్బరి నూనెను వాడటం, 20 ఏళ్లుగా ఈ నియమానుసార జీవితం కొనసాగించడమే తన బలమని పేర్కొన్నారు. తన రూపం వెనుక ఎటువంటి కెమికల్ చికిత్సలు లేవని, పాత్రల కోసం మాత్రమే అప్పుడప్పుడు ఫేషియల్స్ మాత్రమే చేసుకుంటానని తెలిపారు.

Also Read :  Vijay Deverakonda: రౌడీ ఫ్యాన్స్‌కు డబుల్ ధమాకా.. ‘రాణాబాలి’ క్రేజీ అప్‌డేట్!

తినే ఆహారంలోనూ మాధవన్ పద్ధతిగా ఉంటారు. ఇంట్లో వండిన తాజా ఆహారమే తినటానికి ఇష్టపడతారని, షూటింగ్‌ల సమయంలో కూడా తన వ్యక్తిగత చెఫ్‌ను వెంట తీసుకెళ్లి పప్పు, కూరలు, అన్నం వంటి స్వచ్ఛమైన ఆహారాన్ని వండించుకుంటానని తెలిపారు. ఈ సింపుల్ జీవనశైలి వల్లే తనకు శరీరసౌష్టవం, మానసిక ప్రశాంతత రెండూ సమబాలంగా ఉన్నాయని పేర్కొన్నారు.