Kayadu Lohar : టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా గ్లామర్ షో..!

Kayadu

Kayadu Lohar : ఒక హిట్ సినిమా చాలు – సినీ పరిశ్రమలో ఒక నటికి అవకాశాల వర్షం కురిసేలా చేస్తుంది. ఇదే ప్రస్తుతం జరుగుతున్నది డ్రాగన్ బ్యూటీ కయదు లోహర్ కెరీర్‌లో. హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చినా పెద్దగా గుర్తింపు రాకుండా సాగిపోయిన కయదు, ఇప్పుడు డ్రాగన్ సినిమా విజయంతో హాట్ టాపిక్‌గా మారింది.

తెలుగులో కయదు ఇప్పటికే శ్రీవిష్ణుతో అల్లూరి సినిమాలో నటించినా, ఆ సమయంలో అంతగా దృష్టిని ఆకర్షించలేదు. కానీ ప్రదీప్ రంగనాథ్ హీరోగా వచ్చిన డ్రాగన్ సినిమా సక్సెస్ అయ్యాక, కయదు గ్లామర్ షో కుర్రాళ్ల గుండెల్లో మంటలు రేపింది. ఈ ఒక్క హిట్‌తోనే కయదు పేరు బాగా పాపులర్ అయి, వరుస అవకాశాలు వస్తున్నాయి.

Also Read :  Buchi Babu: పెళ్లి రోజున కూడా కంటిమీద కునుకు లేదు.. 'పెద్ది' కోసం బుచ్చిబాబు నెక్స్ట్ లెవెల్ తపస్సు!

ప్రస్తుతం కయదు మాస్ కా దాస్ విశ్వక్ సేన్తో ఫంకీ సినిమాలో నటిస్తోంది. అలాగే రవితేజ అనార్కలి చిత్రంలో కూడా ఆమె నటిస్తున్నట్టు టాక్ వినిపిస్తోంది. సినిమాలే కాదు, కయదు సోషల్ మీడియాలో షేర్ చేస్తున్న గ్లామరస్ ఫోటో షూట్స్ కూడా వైరల్ అవుతున్నాయి.

తాజాగా, చంకీల డ్రెస్‌లో కయదు చేసిన ఫోటో షూట్స్ నెట్టింట దుమ్ము రేపుతున్నాయి. అగ్గి రాజేసే అందం, చూపులతో కయదు అభిమానుల హృదయాలను గెలుచుకుంటోంది. డ్రాగన్ హిట్ తర్వాత కయదు ఇంత పాపులర్ అయ్యిందంటే, ఆమె తదుపరి సినిమా విజయం సాధిస్తే టాలీవుడ్‌లో టాప్ రేంజ్ హీరోయిన్లలో ఒకరిగా నిలబడే అవకాశముంది.

Also Read :  Peddi collections: కర్ణాటకలో ‘పెద్ది’ కలెక్షన్ల జాతర.. పుష్ప 2, ఓజీ రికార్డులు గాల్లోకి! రూ.3.02 కోట్లతో ఆల్ టైమ్ రికార్డ్స్..

తెలుగులో కయదు ఫంకీ సినిమాలో స్పెషల్ ఆకర్షణగా నిలవబోతుందన్న హైప్ ఉంది. అనుదీప్ దర్శకత్వంలో వస్తున్న ఈ ప్రాజెక్ట్‌తో కయదు టాలీవుడ్‌లో మరోసారి రీ-ఎంట్రీ ఇస్తోంది. ప్రస్తుతం కయదు తన కొత్త క్రేజ్‌ను ఎంజాయ్ చేస్తూ, గ్లామర్ షోలతో అభిమానులను అలరిస్తోంది. సౌత్‌లో టాప్ హీరోయిన్ అవ్వాలన్న ఆలోచనతో ఆమె గట్టి ప్రయత్నాలు చేస్తోంది.