
Malavika Mohanan : బ్యూటిఫుల్ అండ్ టాలెంటెడ్ హీరోయిన్ మాళవిక మోహనన్, రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న ‘రాజా సాబ్’ సినిమాతో టాలీవుడ్ లోకి గ్రాండ్ ఎంట్రీ ఇవ్వబోతున్నారు. ఈ రోజు ఆమె పుట్టినరోజు సందర్భంగా మూవీ టీమ్ విడుదల చేసిన స్పెషల్ పోస్టర్లో మాళవిక చీరకట్టులో సంప్రదాయ లుక్లో మెరిసిపోతూ అందరినీ ఆకట్టుకుంది. ఇటీవల విడుదలైన టీజర్ లో ఆమె గ్లామరస్ లుక్, గ్రేస్ఫుల్ స్క్రీన్ ప్రెజెన్స్ ప్రేక్షకులను మెస్మరైజ్ చేసింది.
‘రాజా సాబ్’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం కావడం తనకు చాలా ప్రత్యేక అనుభూతి అని మాళవిక మోహనన్ తెలిపింది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీజీ విశ్వప్రసాద్ ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. టాలెంటెడ్ డైరెక్టర్ మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు తమన్ సంగీతం అందిస్తున్నాడు. ఈ మూవీ హిందీ, తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో డిసెంబరు 5న వరల్డ్ వైడ్ గా గ్రాండ్ రిలీజ్ కానుంది. పాన్ ఇండియా స్థాయిలో భారీ అంచనాల నడుమ విడుదల కానున్న ఈ సినిమా మాళవికకు టాలీవుడ్ లో శుభారంభంగా నిలిచే అవకాశాలు ఉన్నాయి.
Team #TheRajaSaab wishes our dazzling diva @MalavikaM_ a very Happy Birthday 💫
She’s all set to stun you with her captivating performance 🤩#HBDMalavikaMohanan#Prabhas @DuttSanjay @DirectorMaruthi @AgerwalNidhhi #RiddhiKumar @Bomanirani @vishwaprasadtg @peoplemediafcy… pic.twitter.com/J33nEjAeqV
— People Media Factory (@peoplemediafcy) August 4, 2025












