Chai Wala Teaser: ఫ్యామిలీ డ్రామా ‘చాయ్ వాలా’ టీజర్ రిలీజ్

Chaiwala

Chai Wala Teaser: రాజీవ్ కనకాల, శివ కందుకూరి తండ్రీ–కొడుకులుగా నటిస్తున్న ఫ్యామిలీ ఎమోషనల్ లవ్ ఎంటర్‌టైనర్ “చాయ్ వాలా” టీజర్ విడుదలైంది. ఇప్పటికే పోస్టర్ ఆకట్టుకోగా, ఇప్పుడు విడుదలైన టీజర్ హృదయాలను తాకేలా ఉంది.ఈ సినిమాకు ప్రమోద్ హర్ష దర్శకత్వం వహించగా, తేజు అశ్విని హీరోయిన్‌గా నటిస్తున్నారు. హర్షిక ప్రొడక్షన్ బ్యానర్‌పై రాధా విజయలక్ష్మి, వెంకట్ ఆర్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. హైదరాబాద్ అంటే గుర్తొచ్చేది బిర్యానీ, ఇరానీ చాయ్. అదే కేఫ్ బ్యాక్‌డ్రాప్‌లో ఫ్యామిలీ ఎమోషన్స్‌ను చూపించారు. రాజీవ్ కనకాల కేఫ్ యజమానిగా, ఆయన కొడుకుగా శివ కందుకూరి కనిపించనున్నారు. ‘నా చాయ్ విలువ రూ.15. అంతకన్నా ఎక్కువ తీసుకున్నా నా విలువ పడిపోతుంది’ అనే రాజీవ్ డైలాగ్‌తో టీజర్ ప్రారంభం అవుతుంది.

Also Read :  Vijay Deverakonda: రౌడీ ఫ్యాన్స్‌కు డబుల్ ధమాకా.. ‘రాణాబాలి’ క్రేజీ అప్‌డేట్!

కుటుంబాన్ని నిలబెట్టేందుకు శ్రమించే ఓ మధ్యతరగతి తండ్రి. సరదాగా తిరిగే యువకుడు, అతని ప్రేమకథ, ఆ తర్వాత తండ్రి కోసం అతడు తీసుకున్న నిర్ణయం.. ఇదే టీజర్‌లో చూపించిన ప్రధాన కథ. ‘వాడు కేఫ్ చూసుకోకపోయినా ఇక్కడే మాతో ఉంటే చాలురా’… ‘ఫస్ట్ టైం పెద్దోడిలా మాట్లాడాడు’ అంటూ రాజీవ్ కనకాల చెప్పిన డైలాగ్స్ హృదయానికి తాకుతాయి. ‘నువ్వు మా కోసం, అమ్మ కోసం, ఈ కేఫ్ కోసం కష్టపడింది చాలురా నాన్నా’ అంటూ హీరో చెప్పిన డైలాగ్ కూడా ఆకట్టుకుంటోంది. మొత్తానికి.. చాయ్ వాలా టీజర్ ఒక మిడ్ క్లాస్ తండ్రి–కొడుకుల బంధాన్ని, లవ్ స్టోరీతో కలిపిన ఎమోషనల్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా సినిమా రాబోతోందని స్పష్టమవుతోంది.