Sitara Ghattamaneni : నేను కేవలం ఇన్‌స్టాగ్రామ్‌లోనే.. సితార క్లారిటీ

Sitara

Sitara Ghattamaneni : సోషల్ మీడియాలో తారల సందడి ఎప్పుడూ ప్రత్యేకమే. తారల పేరు మీద అనేక ఫ్యాన్ అకౌంట్లు నడుస్తుంటే, కొందరు ఫేక్ అకౌంట్లు సృష్టించి గందరగోళం సృష్టిస్తారు. ఈ విషయంపై సూపర్ స్టార్ మహేష్ బాబు కూతురు సితార ఘట్టమనేని తన అభిమానులను అప్రమత్తం చేశారు. సితార ఇన్‌స్టాలో ఒక పోస్ట్ చేస్తూ.. “నా పేరు మీద చాలా ఫేక్ అకౌంట్లు ఉన్నాయని తెలిసింది. దయచేసి జాగ్రత్తగా ఉండండి. నేను కేవలం ఇన్‌స్టాగ్రామ్‌లోనే యాక్టివ్‌గా ఉంటాను. ఇది నా ఏకైక అకౌంట్ మాత్రమే. ఇతర సోషల్ మీడియా ప్లాట్‌ఫాంలలో నేను ఎక్కడా లేను. కాబట్టి నా పేరుతో వచ్చే ఇతర అకౌంట్లు, పోస్టులను నమ్మకండి” అంటూ స్పష్టం చేశారు. ఆమె ఈ పోస్ట్‌కి కామెంట్ సెక్షన్‌ను కూడా క్లోజ్ చేసినట్లు కనిపిస్తోంది.

Also Read :  Rakasa : నవ్విస్తూనే భయపెడుతున్న నిహారిక 'రాకాస' టీజర్

ఇక సితార సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్‌గా ఉంటారో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. మహేష్ బాబు, నమ్రత, గౌతమ్‌తో ఉన్న ఫ్యామిలీ మూమెంట్స్, వెకేషన్ ఫోటోలు తరచూ షేర్ చేస్తూ అభిమానులను అలరిస్తారు. ఇటీవల డ్యాన్స్ క్లాస్, రిహార్సల్ వీడియోలను కూడా పోస్ట్ చేశారు. ప్రస్తుతం సితార బ్రాండ్ అంబాసిడర్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ముఖ్యంగా బంగారు నగల షాపుకు బ్రాండింగ్ చేస్తూ కోట్లలో సంపాదిస్తున్నారని టాక్. ఆ మొత్తాన్ని సేవా కార్యక్రమాలకే వినియోగిస్తామని అప్పట్లో సితార, నమ్రత వెల్లడించారు. మహేష్ బాబు–సితార కలిసి చేసే యాడ్స్ కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి.