
Andhra King Thaluka : ఉస్తాద్ రామ్ పోతినేని హీరోగా మహేష్ బాబు పి దర్శకత్వంలో, మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ‘ఆంధ్రా కింగ్ తాలూకా’ విడుదలకు సిద్ధమవుతోంది. టైటిల్ గ్లింప్స్, రెండు చార్ట్ బస్టర్ సాంగ్స్‌తో ఇప్పటికే ఈ మూవీపై భారీ హైప్ క్రియేట్ అయింది. ఇకపోతే ఉపేంద్ర ఈ సినిమాలో శక్తివంతమైన ‘ఆంధ్రా కింగ్’ పాత్రలో కనిపించనుండగా, నేడు ఆయన పుట్టినరోజు సందర్భంగా మేకర్స్ ప్రత్యేక పోస్టర్‌ను రిలీజ్ చేశారు. సూపర్ స్టార్ లుక్‌లో అభిమానులకు అభివాదం చేస్తున్న ఉపేంద్ర పోస్టర్ అందరినీ ఆకట్టుకుంటోంది.
రామ్ ఇందులో డై-హార్డ్ సినిమా ఫ్యాన్‌గా అలరించనున్నారు. భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా నటిస్తుండగా, రావు రమేష్, మురళీ శర్మ, సత్య, రాహుల్ రామకృష్ణ, VTV గణేష్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. టాప్ టెక్నీషియన్స్‌తో రూపొందుతున్న ఈ చిత్రానికి వివేక్ & మెర్విన్ సంగీతం, సిద్ధార్థ నుని సినిమాటోగ్రఫీ, శ్రీకర్ ప్రసాద్ ఎడిటింగ్, అవినాష్ కొల్లా ప్రొడక్షన్ డిజైన్ అందిస్తున్నారు. గ్రాండ్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న “ఆంధ్రా కింగ్ తాలూకా” నవంబర్ 28న ప్రేక్షకుల ముందుకు రానుంది.
Team #AndhraKingTaluka wishes Real Star @nimmaupendra Garu a very Happy Birthday ❤🔥
His portrayal of 'Andhra King' Surya will be loved and celebrated 💥💥#AndhraKingTaluka in cinemas worldwide on November 28th 🤩#AKTonNOV28
Energetic Star @ramsayz #BhagyashriBorse… pic.twitter.com/r1Qx6qFs5k— Mythri Movie Makers (@MythriOfficial) September 18, 2025












