Anaganaga Oka Raju : సంక్రాంతి పండుగకు నవీన్ పొలిశెట్టి వినోదాల విందు..

Anaganagaokaraju
Anaganaga Oka Raju : తన కామెడీ టైమింగ్‌తో ప్రేక్షకుల హృదయాల్లో ప్రత్యేక స్థానం సంపాదించిన నవీన్ పొలిశెట్టి ఇప్పుడు మరో ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘అనగనగా ఒక రాజు’ తో అలరించడానికి సిద్ధమయ్యారు. ఈ సినిమాతో నవీన్ పొలిశెట్టి రచయితగా, మారి దర్శకుడిగా పరిచయమవుతున్నారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్న ఈ చిత్రానికి మిక్కీ జె మేయర్ సంగీతం అందిస్తున్నారు. ఇక ఇప్పటికే ఈ చిత్రం నుండి విడుదలైన పోస్టర్లు, గ్లింప్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకోగా, తాజాగా విడుదలైన టీజర్, ఈ సంక్రాంతికి ప్రేక్షకులకు వినోదాల విందుని హామీ ఇస్తుంది.

Also Read :  Rakasa : నవ్విస్తూనే భయపెడుతున్న నిహారిక 'రాకాస' టీజర్

బంగారు ఆభరణాల ప్రకటనపై స్పూఫ్ తో ప్రారంభమైన ఈ టీజర్, ఎంతో వైవిధ్యంగా ఉంది. ఒంటి నిండా ఆభరణాలు ధరించిన మీనాక్షి చౌదరి, తమ సినిమా గురించి కాకుండా ఆభరణాల గురించి మాట్లాడుతుండటంతో.. ఆమె ఆభరణాలను నవీన్ పొలిశెట్టి ధరించి కనిపించడం భలే సరదాగా ఉంది. టీజర్ లో నవీన్‌ పొలిశెట్టి, మీనాక్షి చౌదరి పోటాపోటీగా నవ్వులు పంచారు. వినోదభరితంగా రూపొందిన ఈ టీజర్ సినిమాపై అంచనాలను పెంచుతుంది. అంతేకాదు టీజర్ చూసిన ప్రతి ఒక్కరూ నవీన్ ఖాతాలో మరో ఘన విజయం ఖాయమని ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ చిత్రం సంక్రాంతి కానుకగా 2026 జనవరి 14న విడుదల కానుంది.

Also Read :  జగపతి బాబు 'వదలా' ఇంట్రెస్టింగ్ ఫస్ట్ లుక్ రిలీజ్...