Dude : ‘డ్యూడ్’ సినిమా.. హీరోయిన్‌ మమిత బైజు చెప్పిన ఆసక్తికర విషయాలు

Dude
Dude : ‘లవ్ టుడే’, ‘డ్రాగన్‌’ వంటి వరుస హిట్‌లతో యూత్ ఐకాన్‌గా నిలిచిన ప్రదీప్ రంగనాథన్, దీపావళి బరిలో ‘డ్యూడ్’తో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంతో కీర్తిశ్వరన్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ‘ప్రేమలు’ తరువాత మమిత బైజు ఈ చిత్రంలో హీరోయిన్‌గా నటించగా, సీనియర్ నటుడు శరత్ కుమార్ కీలక పాత్రలో కనిపించనున్నారు. ఇప్పటికే విడుదలైన పాటలు చార్ట్‌బస్టర్ హిట్ అవ్వగా, ట్రైలర్‌కి ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. అక్టోబర్ 17న తెలుగు, తమిళం, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లో ఈ చిత్రం గ్రాండ్ రిలీజ్ అవుతుంది.

Also Read :  Sampradayini Suppini Suddapoosani : ఆసక్తికరంగా 'సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని' ట్రైలర్

Mamitabaiju

ఈ సందర్భంగా సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా హీరోయిన్ మమిత బైజు మాట్లాడుతూ.. “ప్రేమలు తరువాత ఈ కథ విన్నప్పుడు చాలా ఎక్సైట్ అయ్యాను. ఈ సినిమాలో నా పాత్రకు చాలా ప్రాధాన్యం వుంది. ఇప్పటివరకూ అలాంటి పాత్ర చేయలేదు. కురల్ చాలా హానెస్ట్ క్యారెక్టర్. ఆమె తన భావోద్వేగాల పట్ల నిబద్ధతగా ఉంటుంది, చుట్టూ ఉన్న వారందరితో స్నేహంగా వుంటుంది. ఆమె చాలా సూటిగా మాట్లాడుతుంది. ఆ పాత్ర చేయడం చాలా మంచి ఎక్స్ పీరియన్స్. ఈ సినిమాలో కొన్ని ఎమోషనల్‌ సీన్స్‌ చాలెంజింగ్‌గా అనిపించాయి కానీ బాగా ప్రిపేర్ అయి చేశాను అని తెలిపారు. అలాగే ప్రదీప్ రంగనాథన్ తో నటించడం మంచి ఎక్స్ పీరియన్స్. ఆయన మల్టీ ట్యాలెంటెడ్. సెట్స్ లో చాలా హెల్ప్ ఫుల్ గా వుంటారు. శరత్ కుమార్ లాంటి సినియర్ యాక్టర్స్ తో కలిసి పని చేయడం అదృష్టంగా భావిస్తున్నాను. ఇక డైరెక్టర్ కీర్తి ఎమోషన్స్, ఫన్ ను చాలా యూనిక్‌గా హ్యాండిల్ చేశారు. సాయి అభ్యంకర్ మ్యూజిక్ సినిమాకి బిగ్ ఎసెట్ అని చెప్పుకొచ్చారు. చివరగా, మైత్రి మూవీ మేకర్స్ ప్యాషన్‌తో ఈ సినిమా గ్రాండ్‌గా రూపొందించారు. ప్రేక్షకులు తప్పకుండా ఇష్టపడతారు అంటూ” మమిత విశ్వాసం వ్యక్తం చేశారు.

Also Read :  Hansi Productions బ్యానర్‌పై యూత్‌ఫుల్ లవ్ డ్రామా ప్రారంభం