
Andhra King Taluka : ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని నటిస్తున్న తాజా చిత్రం ‘ఆంధ్రా కింగ్ తాలూకా’ నవంబర్ 28న ప్రేక్షకుల ముందుకు రానుంది. మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో మహేష్ బాబు పి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో భాగ్యశ్రీ బోర్స్ హీరోయిన్‌గా నటించగా, కన్నడ స్టార్ ఉపేంద్ర కీలక పాత్రలో కనిపించనున్నారు. ఇటీవల విడుదలైన టీజర్‌కు అద్భుతమైన స్పందన రాగా, వివేక్ & మెర్విన్ స్వరపరిచిన మొదటి రెండు పాటలు చార్ట్ బస్టర్ హిట్స్ అయ్యాయి. ఈరోజు, మేకర్స్ థర్డ్ సింగిల్ ‘చిన్ని గుండెలో’ను విడుదల చేశారు.
రాత్రి సముద్ర తీరంలో హీరో, హీరోయిన్ ఇసుకపై నక్షత్రాలను చూస్తూ గడిపే రొమాంటిక్ సన్నివేశాలతో ఈ పాట మాయాజాలాన్ని సృష్టిస్తుంది. రామ్, భాగ్యశ్రీల కెమిస్ట్రీ తెరపై అద్భుతంగా కనపడుతుండగా, కృష్ణకాంత్ రాసిన సాహిత్యం ప్రేమ భావాలను అందంగా వ్యక్తపరుస్తోంది. మర్విన్ సొలోమన్, సత్య యామినీ వోకల్స్ ఈ పాటకు మరింత మాధుర్యం చేకూర్చాయి. జానీ మాస్టర్ రూపొందించిన కొరియోగ్రఫీ విజువల్‌గా ఆకట్టుకుంటోంది. మొత్తానికి ఈ పాట కూడా మ్యూజిక్ లవర్స్‌ను మంత్ర ముగ్ధులను చేస్తోంది.












