Meereley Song Launch : తరుణ్ భాస్కర్ చేతుల మీదుగా జిగ్రీస్ సెకండ్ సాంగ్ రిలీజ్!

Meereley song
యువత కోసం ప్రత్యేకంగా రూపొందిన మరో ఫీల్‌గుడ్ యూత్ ఎంటర్‌టైనర్‌గా ‘జిగ్రీస్’ సిద్ధమవుతోంది. “ఈ నగరానికి ఏమైంది” తరహాలో యూత్‌ఫుల్ ఎమోషన్స్, ఫ్రెండ్‌షిప్, మ్యూజిక్‌లతో నిండిన ఈ చిత్రం నవంబర్ 14న థియేటర్లలో విడుదల కానుంది. ‘మ్యాడ్ స్క్వేర్’ ఫేమ్ రామ్ నితిన్ ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్ర టీజర్‌ను దర్శకుడు సందీప్ రెడ్డి వంగా విడుదల చేయగా, కేవలం మూడు రోజుల్లోనే 2 మిలియన్లకు పైగా వ్యూస్ సాధించి అద్భుతమైన స్పందనను రాబట్టింది.

హరీష్ రెడ్డి ఉప్పుల దర్శకత్వంలో, మౌంట్ మెరు పిక్చర్స్ బ్యానర్‌పై కృష్ణ వోడపల్లి నిర్మిస్తున్న ఈ చిత్రంలో యంగ్ హీరో రామ్ నితిన్‌తో పాటు కృష్ణ బురుగుల, మణి వక్కా, ధీరజ్ అథేర్య ప్రధాన పాత్రల్లో కనిపించనున్నారు. సినిమాటోగ్రఫీ ఈశ్వర్ ఆదిత్య, ఎడిటింగ్ చాణక్య రెడ్డి తూర్పు, సంగీతం కమ్రాన్ సయ్యద్ అందించారు. ఈ చిత్రంలోని ఫస్ట్ లిరికల్ సాంగ్‌ను హీరో కిరణ్ అబ్బవరం విడుదల చేయగా, రెండవ సాంగ్ “మీరెలే”ను దర్శకుడు తరుుణ్ భాస్కర్ విడుదల చేశారు. ఫ్రెండ్స్ మధ్య ఎమోషన్లను, సరదా సన్నివేశాలను గుర్తు చేసే ఈ మెలోడియస్ సాంగ్‌కి మంచి స్పందన లభిస్తోంది.

Also Read :  Sampradayini Suppini Suddapoosani : ఆసక్తికరంగా 'సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని' ట్రైలర్

నలుగురు స్నేహితులు ఒక వింటేజ్ మారుతి కారులో గోవా వెళ్లేందుకు ప్లాన్ చేయడం, ఆ ప్రయాణంలో ఎదురయ్యే ఫన్ మరియు ఎమోషనల్ మోమెంట్స్ చుట్టూ ఈ సినిమా తిరుగుతుంది. ఈ కథ యూత్‌కు దగ్గరగా అనిపించేలా హాస్యం, ఫ్రెండ్‌షిప్ మరియు మ్యూజిక్ మేళవింపుతో తెరకెక్కింది. టీజర్, పాటలు, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అన్నీ పాజిటివ్ బజ్ సృష్టించడంతో ‘జిగ్రీస్’పై అంచనాలు రోజురోజుకీ పెరుగుతున్నాయి. నవంబర్ 14న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న ఈ యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్, ఫ్రెండ్‌షిప్‌ను కొత్త కోణంలో చూపించనున్నట్లు కనిపిస్తోంది.

Also Read :  ఏప్రిల్ 3న గ్రాండ్ రిలీజ్‌కు రెడీ అవుతున్న   తెలుగు–తమిళ  ద్విభాషా చిత్రం ‘కార్మేని సెల్వం’...