Seettha Payanam : బంధాల విలువలను చాటిచెప్పే ‘సీతా పయనం’

Seetha payanam
యాక్షన్ కింగ్ అర్జున్ సర్జా దర్శకత్వంలో నిరంజన్, ఐశ్వర్య అర్జున్ జంటగా తెరకెక్కిన చిత్రం ‘సీతా పయనం’. శ్రీ రామ్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ బ్యానర్‌పై రూపొందిన ఈ మూవీ ద్వారా ఐశ్వర్య హీరోయిన్‌గా పరిచయం అవుతుండగా, కన్నడ స్టార్ ధృవ సర్జా కీలక పాత్రలో నటించారు. ఫిబ్రవరి 14న సినిమా విడుదల కానున్న నేపథ్యంలో నిర్వహించిన ప్రీ-రిలీజ్ ఈవెంట్‌కు హాస్య బ్రహ్మ డా. బ్రహ్మానందం ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ సమాజ సేవకులకు, పర్యావరణ వేత్తలకు (డా. ప్రకాష్ ఆమ్టే, డా. మందాకిని ఆమ్టే, ట్యాంక్ బండ్ శివ, దుశ్చర్ల సత్యనారాయణ) లక్ష రూపాయల చొప్పున ఆర్థిక సాయం అందించి సత్కరించడం అందరినీ ఆకట్టుకుంది.

Also Read :  Suriya46 : సూర్య - వెంకీ అట్లూరి మూవీకి క్లాసీ టైటిల్ ఫిక్స్..

ఈ కార్యక్రమంలో అర్జున్ సర్జా మాట్లాడుతూ.. ఇది కేవలం ఒక సినిమా మాత్రమే కాదని, బంధాల విలువలను, కుటుంబ ఎమోషన్లను చాటిచెప్పే ఒక అందమైన ప్రయాణమని తెలిపారు. తన కుమార్తెను ఒక పాజిటివ్ కథతో పరిచయం చేయాలనే బాధ్యతతో ఈ చిత్రాన్ని తెరకెక్కించానని, ఇందులో తండ్రీకూతుళ్ల మధ్య వచ్చే సీన్లు హైలైట్‌గా ఉంటాయని పేర్కొన్నారు. సత్యరాజ్, ప్రకాష్ రాజ్ వంటి హేమాహేమీలు నటించిన ఈ చిత్రానికి అనూప్ రూబెన్స్ అందించిన సంగీతం ప్రధాన బలంగా నిలుస్తుందన్నారు. కుటుంబ సమేతంగా చూడదగ్గ ఈ చిత్రాన్ని ప్రేక్షకులు ఆదరించాలని చిత్ర యూనిట్ కోరింది.