Sree Vishnu : డబుల్ ట్రీట్‌కు రెడీనా? ఒక రోజు గ్యాప్‌లో శ్రీ విష్ణు రెండు రిలీజ్‌లు!

Sreevishnu
Sree Vishnu : ఎప్పుడూ కొత్త కథలతో, తనదైన కామెడీ టైమింగ్‌తో ప్రేక్షకులను అలరిస్తూ వచ్చిన శ్రీ విష్ణు ఇప్పుడు ‘విష్ణు విన్యాసం’ అనే మరో వినోదాత్మక చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. కొత్త దర్శకుడు యదునాథ్ మారుతి రావు తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో నయన సారిక హీరోయిన్‌గా నటిస్తున్నారు. శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర సినిమాస్ బ్యానర్‌పై రూపొందుతున్న ఈ చిత్రాన్ని ఫిబ్రవరి 28న విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. రిలీజ్ పోస్టర్‌లో శ్రీ విష్ణు క్లాసిక్ బైక్‌పై రిలాక్స్‌గా కూర్చొని, ఫంకీ ప్రింటెడ్ షార్ట్‌, కలర్‌ఫుల్ షర్ట్‌, స్టైలిష్ గ్లాసెస్‌తో కనిపిస్తూ ఆకట్టుకున్నారు. ఆయన లుక్‌ చూస్తే సినిమా సరదాగా, రంగుల మయంగా ఉండబోతుందని అర్థమవుతోంది.

Also Read :  Hansi Productions బ్యానర్‌పై యూత్‌ఫుల్ లవ్ డ్రామా ప్రారంభం

ఈ చిత్రంలో శ్రీ విష్ణు జ్యోతిష్యం, శకునాలు, చిన్నచిన్న నమ్మకాల ప్రభావంలో జీవించే యువకుడిగా కనిపించనున్నారు. ఆ నమ్మకాల చుట్టూ తిరిగే సంఘటనలు వినోదాత్మకంగా ప్రేక్షకులను అలరించనున్నాయి. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్, పాటలు మంచి రెస్పాన్స్ తెచ్చుకోవడంతో సినిమాపై ఆసక్తి పెరిగింది. సత్య, బ్రహ్మాజీ, మురళీ శర్మ తదితరులు కీలక పాత్రల్లో కనిపించనుండగా, రాధన్ సంగీతం అందిస్తున్నారు. విడుదల తేదీ దగ్గరపడుతుండటంతో ప్రమోషన్లు కూడా జోరుగా కొనసాగుతున్నాయి.

Also Read :  Rakasa : నవ్విస్తూనే భయపెడుతున్న నిహారిక 'రాకాస' టీజర్

అంతేకాదు శ్రీ విష్ణు నటించిన మరో చిత్రం ‘మృత్యుంజయ్’ కూడా ఫిబ్రవరి 27 న రిలీజ్ కానుంది. హుస్సేన్ షా కిర‌ణ్ ద‌ర్శ‌క‌త్వంలో వస్తున్న ఈ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్ల‌ర్ లో శ్రీ విష్ణు సరసన రేబా మోనికా జాన్ నటించారు. ఒక రోజు తేడాతో రెండు సినిమాలు వస్తుండడంతో బాక్సాఫీస్ వద్ద శ్రీ విష్ణు ఫ్యాన్స్‌కు పండగనే చెప్పాలి.