Sivakarthikeyan : డివైన్ లుక్‌లో శివకార్తికేయన్.. ‘సెయాన్’ ఫస్ట్ లుక్ వైరల్

Seyon
Sivakarthikeyan Seyon Movie : వర్సటైల్ స్టార్ శివకార్తికేయన్ మరోసారి ఆసక్తికరమైన ప్రాజెక్ట్‌తో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. దర్శకుడు శివకుమార్ మురుగేశన్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రాన్ని కమల్ హాసన్ మరియు ఆర్. మహేంద్రన్ నిర్మిస్తున్నారు. ‘అమరన్’ విజయానంతరం శివకార్తికేయన్ మళ్లీ రాజ్‌కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్‌తో కలిసి పని చేయడం అభిమానుల్లో మరింత ఉత్సాహాన్ని పెంచుతోంది.

గ్రామీణ నేపథ్యంతో భారీ స్థాయిలో రూపొందుతున్న ఈ చిత్రానికి ‘సెయాన్’ అనే టైటిల్‌ను ఫైనల్ చేశారు. కుటుంబ ప్రేక్షకులను, మాస్ ఆడియన్స్‌ను ఒకేసారి ఆకట్టుకునేలా ఎమోషన్స్, యాక్షన్, వినోదం కలగలిపి ఈ సినిమాను రూపొందిస్తున్నారు. 2026లో విడుదలకు ప్లాన్ చేస్తున్న ఈ చిత్రం ఇప్పటికే మంచి బజ్ సృష్టిస్తోంది.

Also Read :  Rakasa : నవ్విస్తూనే భయపెడుతున్న నిహారిక 'రాకాస' టీజర్

ఫస్ట్ లుక్ పోస్టర్‌లో శివకార్తికేయన్ సంప్రదాయ వేషధారణలో డివైన్ లుక్‌లో మెరిశారు. ధోతి, విభూతి, రుద్రాక్షలతో కనిపిస్తూ ఒక ఆధ్యాత్మిక శక్తిని గుర్తు చేస్తున్నారు. ఇక వెనుక కనిపించే నెమలి రెక్కలు మురుగన్ స్వామిని గుర్తు చేస్తూ పాత్రకు మిథికల్ టచ్ ఇచ్చాయి. ఈ చిత్రానికి సంతోష్ నారాయణన్ సంగీతం అందించడం మరో హైలైట్. మొత్తానికి ‘సెయాన్’ 2026లో అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రాల్లో ఒకటిగా నిలవనుంది.