Hansi Productions బ్యానర్‌పై యూత్‌ఫుల్ లవ్ డ్రామా ప్రారంభం

Hansi productions
లవ్ డ్రామా సినిమాలకు ఎప్పుడూ ప్రత్యేక ఆదరణ ఉంటుంది. ప్రస్తుత ట్రెండ్‌కు అనుగుణంగా Hansi Productions బ్యానర్‌పై ఓ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైంది. ఈ బ్యానర్‌పై రూపొందుతున్న తొలి చిత్రం కావడం విశేషం. నిర్మాతగా Sri Hansika Peddireddy వ్యవహరిస్తుండగా, సహ నిర్మాతగా Tavittiraju Talachintala ఉన్నారు. ఈ చిత్రానికి కథ, దర్శకత్వ బాధ్యతలను Raghuvardhan Kotla చేపట్టారు. ముహూర్తపు షాట్‌కు శ్రీధర్ పెద్దిరెడ్డి క్లాప్ కొట్టగా, స్రవంతి పెద్దిరెడ్డి కెమెరా స్విచ్ ఆన్ చేశారు.

Also Read :  Peddi Day 1 Collection: బాక్సాఫీస్ దగ్గర 'పెద్ది' శివతాండవం.. జూన్ 4న 'పెద్ది' బుకింగ్స్ రికార్డ్స్ ఇవే!

ఈ యూత్‌ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్ లవ్ డ్రామాలో Jagan Yogiraj, Navya Chityala హీరో-హీరోయిన్లుగా నటిస్తున్నారు. సీనియర్ నటుడు Devi Prasad కీలక పాత్రలో కనిపించనున్నారు. అలాగే లక్ష్మణ్ మీసాల, పవన్ రమేష్, సునందిని, అంజు వాల్గుమన్ ఇతర ముఖ్య పాత్రల్లో అలరించనున్నారు. ప్రేమ, భావోద్వేగాలు, వినోదం ప్రధాన అంశాలుగా కథ రూపొందినట్టు చిత్ర యూనిట్ తెలిపింది.

Also Read :  Jagapathi Babu: బసిరెడ్డి తర్వాత మళ్లీ ఆ రేంజ్ క్యారెక్టర్.. ‘అప్పలసూరి’: జగపతిబాబు

ఈ సందర్భంగా నిర్మాత Sri Hansika Peddireddy మాట్లాడుతూ, “సినిమా నా కల. అదే అభిరుచితో చిత్ర నిర్మాణంలోకి అడుగుపెట్టాను. మంచి కథకు ప్రాధాన్యం ఇస్తూ, టెక్నికల్‌గా ఉన్నత ప్రమాణాలతో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాం. కొత్త ప్రతిభకు అవకాశం ఇస్తూనే అనుభవజ్ఞులైన టెక్నీషియన్లతో నాణ్యమైన నిర్మాణ విలువలను అందించాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నాం” అని తెలిపారు. త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమవుతుందని దర్శకుడు Raghuvardhan Kotla వెల్లడించారు.