Panja Vaisshnav: మూడేళ్ల గ్యాప్.. 100 కథల రిజెక్షన్! ఎట్టకేలకు కొత్త సినిమాను లైన్‌లో పెట్టిన మెగా హీరో

Panja Vaisshnav

Panja Vaisshnav: ‘ఉప్పెన’ సినిమాతో టాలీవుడ్‌లోకి అదిరిపోయే ఎంట్రీ ఇచ్చి, మొదటి చిత్రంతోనే వంద కోట్ల క్లబ్‌లో చేరిన యంగ్ మెగా హీరో పంజా వైష్ణవ్ తేజ్. ఆ తర్వాత వచ్చిన ‘కొండపొలం’, ‘రంగరంగ వైభవంగా’, ‘ఆదికేశవ’ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయాయి. దీంతో ఈ సారి ఎలాగైనా సాలిడ్ హిట్‌తో కంబ్యాక్ ఇవ్వాలని గట్టి పట్టుదలతో ఉన్న వైష్ణవ్.. కథల ఎంపికలో ఆచూతూచి వ్యవహరిస్తున్నట్లు కనిపిస్తుంది. ఈ క్రమంలోనే గత మూడేళ్లలో ఆయన ఏకంగా 100కు పైగా స్క్రిప్ట్‌లను రిజెక్ట్ చేసినట్లు ఇండస్ట్రీ వర్గాల్లో గట్టి టాక్ నడుస్తోంది. ఎట్టకేలకు ఈ సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ ఈ మెగా హీరో తన నెక్ట్స్ ప్రాజెక్ట్‌ను లాక్ చేశారట.

Also Read :  SPB: నెల్లూరు టు దేశ అత్యున్నత పురస్కారం.. ఎస్పీ బాలు స్పెషల్ స్టోరీ!

యంగ్ డైరెక్టర్ మహేష్ ఎస్ చెప్పిన ఒక వైవిధ్యమైన లైన్ వైష్ణవ్ తేజ్‌కు బాగా నచ్చడంతో వెంటనే ఈ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. కథ వింటున్నంత సేపూ దర్శకుడి నరేషన్ శైలి, స్క్రీన్‌ప్లే ఈ మెగా హీరోను ఎంతగానో ఆకట్టుకున్నాయని సమాచారం. ప్రముఖ నిర్మాణ సంస్థ ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మించనున్నట్లు టాక్. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన ప్రీ-ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయట. త్వరలోనే ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌కు సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చే ఛాన్స్ ఉందంట. ఆ వెంటనే రెగ్యులర్ షూటింగ్‌ను కూడా స్టార్ట్ చేసే ప్లాన్‌లో చిత్ర యూనిట్ ఉందట. లాంగ్ గ్యాప్ తర్వాత, ఏకంగా 100 కథలు విని వైష్ణవ్ తేజ్ ఓకే చేసిన ప్రాజెక్ట్ కావడంతో మెగా అభిమానులతో పాటు టాలీవుడ్ వర్గాల్లోనూ ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.