Vijay Sethupathi: పూరి జగన్నాథ్ ‘స్లమ్‌డాగ్’ ఊచకోత.. మూడు భాషల్లో విజయ్ సేతుపతి ఓన్ డబ్బింగ్ రికార్డ్!

Vijay Sethupathi

Vijay Sethupathi: టాలీవుడ్‌లో తనదైన స్టైల్‌లో సినిమాలు చేస్తూ ఒక ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకున్న డైరెక్టర్ పూరి జగన్నాథ్. ప్రస్తుతం ఆయన మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి కాంబినేషన్‌లో తెరకెక్కిస్తున్న మోస్ట్ అవేటెడ్ యాక్షన్ డ్రామా థ్రిల్లర్ “స్లమ్‌డాగ్ – 33 టెంపుల్ రోడ్”. ఈ పాన్ – ఇండియా చిత్రానికి సంబంధించిన ఒక బిగ్ అప్‌డేట్ ఇటు టాలీవుడ్, అటు కోలీవుడ్‌లో సంచలనం సృష్టిస్తోంది. జూన్ 8న సాయంత్రం చెన్నైలోని హోటల్ గ్రీన్ పార్క్‌లో ఈ చిత్రానికి సంబంధించిన టీజర్ రిలీజ్ కానుంది. ఈ ఈవెంట్‌లో విజయ్ సేతుపతి స్వయంగా పాల్గొని చిత్ర టీజర్‌ను లాంచ్ చేయనున్నారు.

మూడు భాషల్లో విజయ్ సేతుపతి ఓన్ డబ్బింగ్..
ఈ సినిమా టీజర్‌కు సంబంధించి చిత్రబృందం తాజాగా ఒక క్రేజీ అప్‌డేట్ ఇచ్చింది. సాధారణంగా ఇతర భాషల్లో వేరేవారితో డబ్బింగ్ చెప్పించే విజయ్ సేతుపతి, ఈ సినిమా టీజర్ కోసం తెలుగు, తమిళం, హిందీ… మూడు భాషల్లోనూ స్వయంగా ఆయనే డబ్బింగ్ చెప్పారు. దీనికి సంబంధించిన ఫోటోలను నిర్మాణ సంస్థ ‘పూరి కనెక్ట్స్’ సోషల్ మీడియాలో పంచుకుంది. విజయ్ సేతుపతి బేస్ వాయిస్ మూడు భాషల్లోనూ టీజర్‌కు మెయిన్ హైలైట్‌గా మారబోతోందని సమాచారం. ఇప్పటికే రిలీజ్ అయిన ఈ మూవీ పోస్టర్ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఇందులో విజయ్ సేతుపతి పక్కా మాస్, గ్రిట్టీ లుక్‌లో కనిపిస్తున్నారు. స్లమ్ బ్యాక్‌డ్రాప్‌లో… గడ్డం, సన్‌గ్లాసెస్, స్కార్ఫ్, మాసిన బట్టలు, చేతిలో ఒక కర్ర పట్టుకుని స్ట్రీట్ సర్వైవర్‌గా సేతుపతి ఇచ్చిన లుక్ సినిమాపై అంచనాలను అకాశానికి చేర్చింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్న ఈ చిత్రంలో విజయ్ సేతుపతి సరసన టాలెంటెడ్ యాక్ట్రెస్ టబు, క్రేజీ బ్యూటీ సంయుక్త మీనన్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. పూరి జగన్నాథ్, ఛార్మీ కౌర్ సంయుక్తంగా ‘పూరి కనెక్ట్స్’ బ్యానర్‌పై భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళం భాషల్లో పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.