Vishal Makutam: డైరెక్టర్‌గా మారుతున్న యాక్షన్ హీరో.. రేపే టీజర్ రిలీజ్!

Vishal Makutam

Vishal Makutam: కోలీవుడ్ యాక్షన్ హీరో విశాల్ తన మెగా డ్రీమ్‌ను నెరవేర్చుకుంటున్నారు. ఈ స్టార్ హీరో ఫర్ ది ఫస్ట్ టైం డైరెక్టర్‌గా మెగా ఫోన్ పట్టుకుంటున్నారు. విశాల్ హీరోగా నటిస్తూ, స్వయంగా దర్శకత్వం వహిస్తున్న ద్విభాషా (తమిళం, తెలుగు) యాక్షన్ థ్రిల్లర్ ‘మకుటం’ (తమిళంలో ‘మగుడం’). ఈ క్రేజీ ప్రాజెక్ట్‌కు సంబంధించిన ఒక అదిరిపోయే అప్‌డేట్‌ను తాజాగా విశాల్ సోషల్ ఎక్స్‌ వేదికగా పంచుకున్నారు. ఈ సినిమా అఫీషియల్ టీజర్‌ను జూన్ 10న రిలీజ్ చేయబోతున్నట్లు ప్రకటించారు. సూపర్ గుడ్ ఫిలిమ్స్ పతాకంపై ఆర్.బి. చౌదరి నిర్మిస్తున్న ఈ ప్రతిష్టాత్మక చిత్రం, ఆ బ్యానర్‌లో 99వ ప్రాజెక్ట్ కావడం విశేషం.

నిజానికి ఈ సినిమా 2025 మధ్యలో డైరెక్టర్ రవి అరసు డైరెక్షన్‌లో స్టార్ట్ అయ్యింది. అయితే హీరో విశాల్‌కు – డైరెక్టర్‌కు మధ్య తలెత్తిన కొన్ని ‘క్రియేటివ్ డిఫరెన్సెస్’ కారణంగా రవి అరసు ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నారని సమాచారం. ఆ సమయంలో నిర్మాతకు నష్టం రాకూడదనే బాధ్యతతో విశాల్ స్వయంగా ఈ చిత్రానికి స్క్రీన్‌ప్లే రాస్తూ డైరెక్షన్ బాధ్యతలను భుజాన వేసుకున్నారని టాక్. ఈ చిత్రానికి రవి అరసు కథను అందించారు.

Also Read :  Ram Charan: బుచ్చిబాబుకు రామ్ చరణ్ బంపర్ ఆఫర్.. ‘కథ రెడీ చేస్కో.. రెండో సినిమా చేద్దాం’!

ఈ సినిమాలో విశాల్ వన్-మ్యాన్ షో చేయబోతున్నారు. కథ ప్రకారం ఆయన ఇందులో మూడు విభిన్నమైన పాత్రల్లో కనిపించనున్నారని టాక్. ఒక సాధారణ మెడికల్ రిప్రజెంటేటివ్‌గా, అలాగే క్రూరమైన గ్యాంగ్‌స్టర్ డాన్ ‘లింగ’ పాత్రలో, 1990ల కాలం నాటి లెజెండరీ సంగీత దర్శకుడు ఇళయరాజా వీరాభిమాని పాత్రలో ఆయన స్రీన్‌పై కనిపించనున్నారని చెబుతున్నారు. ఈ మూడు పాత్రల కోసం విశాల్ తెలుగులో స్వయంగా మూడు రకాల విభిన్నమైన వాయిస్ బేస్‌లతో డబ్బింగ్ చెబుతున్నారట.

ఈ సినిమా షూటింగ్ గత ఏడాది చివర్లోనే దాదాపు పూర్తయిందని సమాచారం. ఈ మూవీ కోసం సుమారు 100 మందికి పైగా స్టంట్‌మెన్‌లతో అత్యంత భారీ స్థాయిలో యాక్షన్ క్లైమాక్స్ సీక్వెన్స్‌ను చిత్రీకరించినట్లు తెలుస్తోంది. సినిమాలోని ఈ యాక్షన్ ఎపిసోడ్స్ ప్రేక్షకులకు గూస్‌బంప్స్ తెప్పించడం ఖాయమని చిత్రబృందం ధీమా వ్యక్తం చేస్తోంది. ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్‌లో రజనీకాంత్ ‘వేట్టయాన్’ ఫేమ్ దుషారా విజయన్ హీరోయిన్‌గా నటిస్తుండగా.. అంజలి, యోగి బాబు, శ్రీకాంత్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి జి.వి. ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నారు. తన 30 ఏళ్ల కలను నిజం చేసుకుంటూ విశాల్ మెగా ఫోన్ పట్టి తెరకెక్కించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి రికార్డులు సృష్టిస్తుందో చూడాలి.