Mega 158 Update: పోల్లాచి షెడ్యూల్ కంప్లీట్.. ‘బ్లడీ బెంచ్‌మార్క్’ సెట్ చేయడానికి రెడీ అవుతున్న మెగాస్టార్-బాబీ కాంబో!

Mega158

Mega 158 Update: మెగాస్టార్ చిరంజీవి – బ్లాక్‌బస్టర్ డైరెక్టర్ బాబీ కొల్లి కాంబినేషన్‌లో వస్తున్న ‘Mega158’ ప్రాజెక్ట్ శరవేగంగా తెరకెక్కుతుంది. గతంలో వీరిద్దరి కాంబోలో వచ్చిన ‘వాల్తేరు వీరయ్య’ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి వసూళ్ల సునామీ సృష్టించిందో అందరికీ తెలిసిందే. ఇప్పుడు మరోసారి అంతకు మించిన పవర్‌ఫుల్ కంటెంట్‌తో ఈ కాంబినేషన్ రిపీట్ అవుతుండటంతో అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన పోల్లాచి షెడ్యూల్‌ను చిత్ర బృందం సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్ చేసుకుంది. ఈ హై-ఎనర్జీ షెడ్యూల్‌లో ప్రధాన తారాగణంపై కొన్ని అత్యంత కీలకమైన సన్నివేశాలను డైరెక్టర్ బాబీ షూట్ చేసినట్లు మేకర్స్ వెల్లడించారు. పోల్లాచి షెడ్యూల్ కంప్లీట్ కావడంతో చిత్ర యూనిట్ ఏమాత్రం గ్యాప్ తీసుకోకుండా తదుపరి షెడ్యూల్‌కు రెడీ అయిపోతోంది.

Also Read :  Peddhi Movie Budget: "పెద్ది" బడ్జెట్‌లో సగం జీతాలేనా! రెమ్యూనిరేషన్ల కోసమే రూ. 170 కోట్లా?

నెక్స్ట్ షెడ్యూల్ చాలా త్వరలోనే స్టార్ట్ కానుందని, ఈ సినిమాతో బాక్సాఫీస్ వద్ద ఒక ‘బ్లడీ బెంచ్‌మార్క్’ సెట్ చేయబోతున్నామని టీమ్ ధీమా వ్యక్తం చేసింది. దీనికి సంబంధించిన మరిన్ని క్రేజీ అప్‌డేట్స్‌ను అతి త్వరలోనే పంచుకోనున్నట్లు సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు. ఈ చిత్రాన్ని కేవీఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై వెంకట్ కె.నారాయణ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో మెగాస్టార్ చిరంజీవి, యంగ్ బ్యూటీస్ అనస్వర రాజన్, నివేదా పేతురాజ్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. టాలీవుడ్ సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ ఎస్.ఎస్.తమన్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్నారు. సక్సెస్‌ఫుల్‌గా పోల్లాచి షెడ్యూల్ ప్యాకప్ అవ్వడంతో మెగా ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు.