Rukmini Vasanth: నాని ప్రొడక్షన్‌లో కన్నడ బ్యూటీ రుక్మిణి వసంత్.. క్రేజీ ప్రాజెక్ట్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లేనా?

Rukmini Vasanth

Rukmini Vasanth: కన్నడ బ్లాక్‌బస్టర్ సినిమా ‘సప్త సాగరదాచే ఎల్లో’ (తెలుగులో ‘సప్త సాగరాలు దాటి’) చిత్రంతో తెలుగు ప్రేక్షకుల మనసు దోచుకుంది కన్నడ క్రష్ రుక్మిణి వసంత్. తన నాచురల్ యాక్టింగ్‌తో సౌత్‌లో ప్రస్తుతం క్రేజీ, బిజీ హీరోయిన్‌గా దూసుకుపోతున్న ఈ ముద్దుగుమ్మ, త్వరలోనే నేచురల్ స్టార్ నాని నిర్మాణంలో ఒక క్రేజీ ప్రాజెక్ట్ చేయబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. నేచురల్ స్టార్ నాని నటుడిగానే కాకుండా.. వాల్ పోస్టర్ సినిమా బ్యానర్‌పై విభిన్నమైన సినిమాలను నిర్మిస్తూ సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్‌గానూ దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. తాజాగా ఆయన నిర్మాణంలో రాబోతున్న ఓ క్రేజీ ప్రాజెక్ట్ గురించి ఫిలిం నగర్ వర్గాల్లో ఒక ఆసక్తికరమైన అప్‌డేట్ చక్కర్లు కొడుతోంది. నాని తన సొంత బ్యానర్‌పై త్వరలో నిర్మించబోయే సరికొత్త చిత్రంలో హీరోయిన్‌గా రుక్మిణి వసంత్‌ను సంప్రదించినట్లు టాలీవుడ్ వర్గాల్లో ప్రస్తుతం జోరుగా ప్రచారం జరుగుతుంది.

Also Read :  AA23 Movie Update: దసరా తర్వాత బన్నీతో లోకేష్ కనగరాజ్ విధ్వంసం!

ఈ సినిమాలోని ఫిమేల్ లీడ్ క్యారెక్టర్ చాలా పవర్‌ఫుల్‌గా ఉండటంతో పాటు నాని ప్రొడక్షన్ వాల్యూస్, కథపై నమ్మకంతో రుక్మిణి వసంత్ ఈ ప్రాజెక్ట్‌కు దాదాపు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసినట్లు సమాచారం. ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన చర్చలు తుది దశకు ఉన్నాయని, త్వరలోనే దీని గురించి మేకర్స్ అధికారికంగా ప్రకటించే అవకాశం ఉందని ఇండస్ట్రీ వర్గాల టాక్. ఇప్పటికే టాలీవుడ్‌లో పలువురు స్టార్స్ సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉన్న రుక్మిణి.. ఇప్పుడు నాని ప్రొడక్షన్‌లోకి కూడా ఎంట్రీ ఇస్తుండటంతో ఈ క్రేజీ కాంబినేషన్‌పై సినీ లవర్స్‌లో ఆసక్తి నెలకొంది.