Mega History: అరుదైన చరిత్రను సృష్టించిన చిరు – చరణ్! ప్రపంచ సినిమా చరిత్రలో ఒకే ఏడాదిలో రూ.300 కోట్ల క్లబ్‌లోకి తండ్రీకొడుకులు..

Mega History

Mega History: టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర రికార్డులు తిరగరాయడం మెగా ఫ్యామిలీకి కొత్తేమీ కాదు. కానీ ఈసారి మెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఏకంగా ప్రపంచ సినిమా చరిత్రలోనే ఎవరికీ సాధ్యం కాని ఒక అద్భుతమైన ఘనతను సొంతం చేసుకున్నారు. ఒకే ఏడాదిలో తండ్రీకొడుకులు ఇద్దరూ రూ.300 కోట్ల గ్రాస్ మైలురాయిని అందుకొని సరికొత్త రికార్డు సృష్టించారు. ఒకవైపు మెగాస్టార్ చిరంజీవి నటించిన మన శంకర వరప్రసాద్ గారు చిత్రం బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టించి రూ.300 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసిన సంగతి తెలిసిందే. ఇదే ఏడాదిలో రామ్ చరణ్ హీరోగా వచ్చిన పెద్ది సినిమా కూడా భారీ వసూళ్లతో రూ.300 కోట్ల క్లబ్‌లో అఫీషియల్‌గా చేరిపోయింది.

Also Read :  Peddi: మిక్సిడ్ టాక్‌ను తలకిందులు చేస్తూ రూ. 250 కోట్ల దిశగా 'పెద్ది'!

సినిమా చరిత్రలో ఒకే సంవత్సరంలో తండ్రి, కొడుకు ఇద్దరి సినిమాలు విడివిడిగా రూ.300 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ సాధించడం ఇదే మొదటిసారి అని సినీ వర్గాలు చెబుతున్నాయి. ఈ అరుదైన ఘనతపై టాలీవుడ్ వర్గాలతో పాటు ప్రేక్షకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. భవిష్యత్తులో కలెక్షన్ల రికార్డులు బ్రేక్ అవ్వొచ్చేమో కానీ… ఒకే ఏడాదిలో తండ్రీకొడుకులు ఇద్దరూ ఇలాంటి భారీ విజయాలు అందుకొని చరిత్ర సృష్టించడం మాత్రం మళ్లీ జరగడం చాలా కష్టమని అభిప్రాయపడుతున్నారు. మొత్తానికి ఈ మెగా రికార్డుతో తెలుగు సినిమా స్థాయి మరోసారి ప్రపంచ వ్యాప్తంగా మారుమోగిపోతోంది.