VenkyAnil5: క్రేజీ మల్టీస్టారర్ షురూ.. వెంకటేశ్, కల్యాణ్ రామ్ మూవీ గ్రాండ్ లాంచ్.. టార్గెట్ సంక్రాంతి!

VenkyAnil5

VenkyAnil5: టాలీవుడ్‌లో మరో క్రేజీ మల్టీస్టారర్ చిత్రానికి అధికారికంగా అడుగులు పడ్డాయి. విక్టరీ వెంకటేశ్, నందమూరి హీరో నందమూరి కల్యాణ్ రామ్ కాంబోలో అనిల్ రావిపూడి డైరెక్షన్‌లో తెరకెక్కబోతున్న కొత్త చిత్రం (#VenkyAnil5 / #NKRAR2) పూజా కార్యక్రమాలతో స్టార్ట్ అయ్యింది. హైదరాబాద్‌లో జరిగిన ఈ పూజా కార్యక్రమాల్లో హీరోలు విక్టరీ వెంకటేశ్, నందమూరి కల్యాణ్ రామ్‌లతో పాటు ఈ సినిమాలో నటిస్తున్న క్రేజీ హీరోయిన్లు కీర్తి సురేష్, కృతి శెట్టి కూడా పాల్గొని సందడి చేశారు.

Also Read :  Srikanth Odela: మెగాస్టార్-శ్రీకాంత్ ఓదెల సినిమా ఆగిపోయిందా? ‘ఫ్యాన్‌బాయ్’ ఓదెల మార్క్ రియాక్షన్..

డైరెక్టర్ అనిల్ రావిపూడి, విక్టరీ వెంకటేశ్‌ల కాంబినేషన్‌లో గతంలో వచ్చిన ‘ఎఫ్ 2’, ‘ఎఫ్ 3’ సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఎలాంటి నవ్వుల పండగ సృష్టించాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇప్పుడు వీరి కాంబోకి నందమూరి కల్యాణ్ రామ్ కూడా తోడవడంతో ఈ ప్రాజెక్ట్‌పై ట్రేడ్ వర్గాల్లో అప్పుడే భారీ అంచనాలు నెలకొన్నాయి. సరికొత్త కథాంశంతో, అవుట్ అండ్ అవుట్ కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రాన్ని అనిల్ రావిపూడి ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో వెంకీ – కల్యాణ్ రామ్‌లు బావ – బావమర్దిగా నటించనున్నట్లు సమాచారం. ఈ క్రేజీ మల్టీస్టారర్ చిత్రాన్ని వచ్చే ఏడాది సంక్రాంతి 2027 కానుకగా ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేయాలని మేకర్స్ టార్గెట్ పెట్టుకున్నారట. పండగ సీజన్‌కు పక్కాగా సరిపోయే ఫ్యామిలీ అండ్ యాక్షన్ ఎలిమెంట్స్‌తో ఈ సినిమా ఉండబోతుందని ఫిల్మ్ నగర్ టాక్. త్వరలోనే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ కానుంది.