
Dhanush – Mrunal Thakur: గత కొన్ని నెలలుగా సినీ వర్గాల్లో, సోషల్ మీడియాలో కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ – బాలీవుడ్ బ్యూటీ మృణాల్ ఠాకూర్ ప్రేమాయణం వార్తలు విపరీతంగా చక్కర్లు కొడుతున్న సంగతి తెలిసిందే. తాజాగా వీరి ప్రేమాయణం వార్తలపై ఒక షాకింగ్ అప్‌డేట్ నెట్టింట హల్‌చల్ చేస్తోంది. వీరిద్దరి రిలేషన్‌షిప్‌పై ఇన్నాళ్లూ సాగిన ఊహాగానాలకు బ్రేక్ వేస్తూ.. ఈ క్రేజీ జంట ఇప్పుడు విడిపోయినట్లు జోరుగా ప్రచారం జరుగుతుంది. ఈ రూమర్ సెలబ్రేటీ లవర్స్‌కు అత్యంత సన్నిహితంగా ఉండే వర్గాల నుంచి అందుతున్న లీక్స్ ప్రకారం.. ధనుష్ – మృణాల్ ఠాకూర్ తమ బంధానికి స్వస్తి పలకాలని డిసైడ్ అయ్యారట. ఇద్దరూ పరస్పర అంగీకారంతోనే ఎవరి దారి వారు చూసుకోవాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.
అయితే, ఈ ఇద్దరు స్టార్స్ బ్రేకప్ అవ్వడానికి గల అసలు కారణాలు ఏంటనేది మాత్రం ఇప్పటికీ సస్పెన్స్‌గానే మిగిలిపోయింది. ఈ వ్యవహారంపై ఎలాంటి అధికారిక రాలేదు. అసలు వాళ్లు ప్రేమలో ఉన్నట్లే ఎక్కడ చెప్పలేదు అని నెట్టింట కామెంట్స్ కూడా వస్తున్నాయి. మృణాల్ ఠాకూర్ హీరోయిన్‌గా నటించిన ‘సన్ ఆఫ్ సర్దార్ 2’ సినిమా ప్రీమియర్ షోకు ధనుష్ ప్రత్యేకంగా హాజరు కావడంతో వీరిద్దరి మధ్య ఏదో నడుస్తోందనే వార్తలు అప్పట్లో ఒక్కసారిగా ఊపందుకున్నాయి. కేవలం స్క్రీనింగ్‌కు రావడమే కాకుండా.. ఆ తర్వాత కూడా వీరిద్దరూ కలిసి పలుమార్లు పబ్లిక్‌గా కనిపించడంతో, ఫ్యాన్స్ సైతం వీరి మధ్య స్నేహం కంటే ఎక్కువే ఉందనే క్లారిటీకి వచ్చారు. ఈ క్రమంలోనే ఇప్పుడు వీరిద్దరూ విడిపోయారనే వార్త బయటకు రావడంతో ఇటు ధనుష్ అభిమానులు, అటు మృణాల్ ఫ్యాన్స్ తీవ్ర నిరాశకు గురవుతున్నారు. సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌లో ఈ బ్రేకప్ వార్త ప్రస్తుతం హాట్ టాపిక్‌గా ట్రెండ్ అవుతోంది. దీనిపై ఈ స్టార్స్ ఎలా స్పందిస్తారో చూడాలి.











