Thella Kagitham: ‘కోర్ట్’ ఫేమ్ హర్ష్ రోషన్ ‘తెల్లకాగితం’ షూటింగ్ కంప్లీట్.. రిలీజ్ ఎప్పుడంటే?

Thella Kagitham

Thella Kagitham: ‘కోర్ట్’, ‘బ్యాండ్ మేళం’ చిత్రాలతో యూత్‌లో మంచి గుర్తింపు తెచ్చుకున్న యంగ్ యాక్టర్ హర్ష్ రోషన్ హీరోగా నటిస్తున్న సరికొత్త చిత్రం ‘తెల్లకాగితం’. నక్షత్ర హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ సినిమా షూటింగ్ తాజాగా సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్ అయ్యింది. ఈ విషయాన్ని హీరో హర్ష్ రోషన్ సోషల్ మీడియా వేదికగా అధికారికంగా వెల్లడిస్తూ.. సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతుందని ప్రకటించారు. అరుణాచల క్రియేషన్స్ బ్యానర్‌పై ప్రొడ్యూసర్ కృష్ణ కొమ్మలపాటి ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి రమేశ్ బండ్రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. ఆయనకు ఇదే డెబ్యూ మూవీ.

Also Read :  The Paradise: సెప్టెంబర్ 25న థియేటర్స్‌లో నాని జడల్ హంగామా.. సరికొత్త వేటకు డేట్ లాక్!

ఇటీవలే రిలీజ్ అయిన ఈ సినిమా ఫస్ట్‌లుక్ పోస్టర్‌కు సోషల్ మీడియాలో మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ చిత్రానికి ‘సమజవరగమన’ ఫేమ్ నందు సవిరిగన కథ, స్క్రీన్‌ప్లే, డైలాగ్స్ అందించడం విశేషం. ఆయన మార్క్ యూత్‌ఫుల్ ఎమోషన్స్, హార్ట్ టచింగ్ సీన్స్ ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి. అంతేకాకుండా, ఈ సినిమా ఆడియో హక్కులను ప్రముఖ మ్యూజిక్ లేబుల్ ‘సరిగమ’ భారీ ధరకు సొంతం చేసుకుంది. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం శరవేగంగా పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటోంది. త్వరలోనే చిత్ర బృందం టీజర్, ట్రైలర్, రిలీజ్ డేట్ అప్‌డేట్స్‌ను వెల్లడించనున్నట్లు సమాచారం.