Peddi OTT release: సినిమా ప్రియులకు సరికొత్త ఓటీటీ వినోదాన్ని పంచేందుకు మరో క్రేజీ సినిమా రెడీ అయిపోయింది. థియేటర్లలో ప్రేక్షకులను ఆకట్టుకున్న మోస్ట్ అవేటెడ్ మూవీ ‘పెద్ది’ డిజిటల్ ప్రీమియర్‌కు డేట్ లాక్ చేసుకుంది. ప్రముఖ ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ (Netflix) వేదికగా ఈ సినిమా వచ్చే వారమే స్ట్రీమింగ్ కానుందని జోరుగా ప్రచారం జరుగుతుంది. ఈ చిత్రం కేవలం ఒక్క భాషకే పరిమితం కాకుండా పాన్ ఇండియా రేంజ్‌లో సౌత్ భాషలన్నింటిలోనూ రిలీజ్ కాబోతోంది. ఒరిజినల్ వెర్షన్‌తో పాటు తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో డబ్బింగ్ వెర్షన్లు ఒకేసారి అందుబాటులోకి రానున్నాయి. ఈ చిత్రం జూలై 2న డిజిటల్ ప్లాట్‌ఫామ్‌పై గ్రాండ్‌గా రిలీజ్ కానుందని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. దీనికి సంబంధించి మేకర్స్ నుంచి అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రావాల్సి ఉంది. థియేటర్లలో మిస్ అయిన వారు, అలాగే ఓటీటీలో ఈ యాక్షన్ డ్రామాను వీక్షించాలనుకునే వారి కోసం నెట్‌ఫ్లిక్స్ వచ్చే వారమే భారీ స్థాయిలో ‘పెద్ది’ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సర్వం సిద్ధం చేస్తుందట.
పెద్ది కథ:
విజయనగరం పట్టణానికి దగ్గరలో ఉన్న ఓ కొండ కింద పల్లెలో నివసిస్తూ ఉండే ఆదివాసి పెద్ది (రామ్ చరణ్). అతని గ్రామానికి గుర్తింపు ఉండదు. ఆ గ్రామంలో ఉండే వారికి ఎలా గుర్తింపు కూడా ఉండదు. అయినా సరే, తన గ్రామానికి గుర్తింపు తీసుకురావాలని, తన ఊరి మీదుగా వెళ్లే రైలుకి ఒక స్టేషన్ ఏర్పాటు చేసి తన గ్రామంలో ఆగేలా చేయాలని అదే గ్రామానికి చెందిన అప్పలసూరి (జగపతిబాబు) తీవ్రంగా ప్రయత్నిస్తూ ఉంటాడు. మరోపక్క పెద్ది, డబ్బు ఎవరు ఎక్కువ ఇస్తే వారి తరఫున క్రికెట్ ఆడుతూ ఉంటాడు. అయితే ఒకానొక సందర్భంలో ఆ ఊరి ఎమ్మెల్యే కూతురు అచ్చి అమ్మ (జాన్వీ కపూర్) కోసం, తాను ఎవరి కోసం అయితే క్రికెట్ ఆడతాడో వారితోనే గొడవ పడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఈ క్రమంలో వారంతా అతన్ని అవమానించి ఆత్మగౌరవం మీద దెబ్బ కొడతారు.
ఈ క్రమంలో అదే ఊరిలో ఉండి ఎంతోమందికి కుస్తీ నేర్పిస్తూ ఉండే గౌరీ నాయుడు (శివ రాజ్‌కుమార్) దగ్గర కుస్తీ నేర్చుకోవడానికి చేరుతాడు. కుస్తీలో నేషనల్స్ సాధించి తన ఊరికి గుర్తింపు తీసుకురావాలని తాపత్రయపడుతున్న క్రమంలో, ఒక ఊహించని సంఘటన పెద్ది జీవితాన్ని తారుమారు చేస్తుంది. తన ఊరి బాగు కోసం ఢిల్లీ బయలుదేరిన పెద్ది ఏం చేశాడు? అతని జీవితాన్ని చిన్నాభిన్నం చేసిన ఆ సంఘటన ఏంటి? ఆ సంఘటన తరువాత కూడా తన ఊరి కోసం పెద్ది ఎలాంటి ప్రయత్నాలు చేశాడు, ఎంతవరకు సఫలమయ్యాడు? చివరికి అతని ఊరిలో ట్రైన్ ఆగిందా లేదా అనేది ఈ సినిమా కథ.











